అభినవ్‌ గోమఠం..మస్తు షేడ్స్‌ ఉన్నాయిరా !

టాలీవుడ్‌ ప్రముఖ కమెడియన్‌ అభినవ్‌ గోమఠం గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ‘మళ్లీరావా’ చిత్రంతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చి ‘ఈ నగరానికి ఏమైంది’, ‘విూకు మాత్రమే చెప్తా’, ‘ఇచ్చట వాహనములు నిలపరాదు’ సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.

ఇక ఈ సినిమాలు ఇచ్చిన జోష్‌తో ప్రస్తుతం వరుస సినిమాలను లైన్‌లో పెడుతున్నాడు. అభినవ్‌ గోమఠం తాజాగా నటిస్తున్న కామెడీ ఎంటర్‌టైనర్‌ ‘మస్తు షేడ్స్‌ ఉన్నాయ్‌ రా.!’. ఈ సినిమాకు తిరుపతి రావు దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ కంప్లీట్‌ చేసుకోగా పోస్ట ప్రొడక్షన్‌ పనుల్లో బిజీగా ఉంది.

ఈ మూవీ నుంచి ఫస్ట్‌ షేడ్‌ని త్వరలోనే విడుదల చేయనున్నట్లు మేకర్స్‌ సోషల్‌ మీడియా వేదికగా ప్రకటించారు. కాసుల క్రియేటివ్‌ వర్క్స్‌ బ్యానర్‌పై వంశీ నందిపాటి సమర్పణలో ఆరేం రెడ్డి, ప్రశాంత్‌, భవాని కాసుల నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు రచన ,దర్శకత్వం: తిరుపతి రావు.