అటు టైటిల్ విన్నర్ ఇటు టాలీవుడ్ లో స్టార్ హీరో అయ్యే సినిమా ఛాన్స్.. ?

ప్రస్తుతం స్టార్ మా లో సాగుతున్న బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 4 లో బాగా తెలిసిన కంటెస్టంట్ అంటే అభిజీత్ అని చెప్పాలి. క్లాస్ చిత్రాల దర్శకుడు శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమాతో టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు. ఈ సినిమా అంత సక్సస్ కాకపోయినా అభిజీత్ కి మాత్రం మంచి పేరొచ్చింది. అంతేకాదు ఈ సినిమాలో నటించిన అమల తో పరిచయం అక్కినేని ఫ్యామిలీకి దగ్గర చేసిందని అంటుంటారు. ఇక బిగ్ బాస్ సీజన్ 4 కి వచ్చాక నాగార్జున కి మరింత దగ్గరవడమే కాదు అక్కినేని ఫ్యామిలీకి బాగా చేరువయ్యాడు. అలాగే అక్కినేని అభిమానుల్లో కూడా క్రేజ్ సంపాదించుకున్నాడు.

Life is Beautiful: Amazon.in: Abhijeet, Gurusharan, Shreya, Kaur, Shekar  Kammula, Shekar Kammula, Mickey.J. Mayor, Abhijeet, Gurusharan: Movies & TV  Shows

అభిజీత్ లో ఉన్న సాఫ్ట్ కార్నర్ వల్ల ప్రస్తుతం ప్రేక్షకుల్లో కూడా మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు. ఇక బిగ్ బాస్ లో స్ట్రాంగ్ కంటెస్టంట్స్ లో అభిజీత్ ఫస్ట్ ప్లేస్ లో ఉన్నాడని చెప్పుకుంటున్నారు. కాగా గత కొన్ని వారాలుగా ప్రేక్షకుల్లో ఈసారి బిగ్ బాస్ టైటిల్ విన్నర్ అభిజీత్ అని గట్టిగా ఫికయ్యారు. చాలామంది అదే అభిజీత్ బిగ్ బాస్ 4 టైటిల్ గెలుచుకోబోతున్నాడని చెప్పుకుంటున్నారు. ఇక బిగ్ బాస్ లో జరుగుతున్న తాజా పరిణామాలు.. సీజన్ 4 ఫైనల్ ఎపిసోడ్ కి చేరువలో ఉండటంతో కూడా టైటిల్ విన్నర్ ఖచ్చితంగా అభిజీత్ అని అంటున్నారు. అయితే ఫైనల్ ఎపిసోడ్ లో బిగ్ బాస్ ఎలాంటి ట్విస్ట్ ఇస్తారో చూడాలి. అందుకంటే సీజన్ 4 ప్రేక్షకుల ఊహకి రివర్స్ లో సాగుతోంది. ఒకరు ఎలిమినేట్ కావాల్సింది ఒకరు అవుతున్నారు.

Abhijeet Raises Doubts Over Bigg Boss Voting System!

ఎప్పుడు ఏమి జరుగుతుందో అన్న కంఫ్యూజన్ ఆడియన్స్ లో బాగా క్రియేటయింది. ఎవరిని ఎందుకు సేవ్ చేస్తున్నారో ఎవరిని ఎందుకు ఎలిమినేట్ చేస్తున్నారో పూర్తిగా అర్థం కాని పరిస్థితి. అందుకు ఉదాహరణ మోనాల్ గజ్జర్ అని క్లియర్ గా చెప్పొచ్చు. కాగా లేటెస్ట్ న్యూస్ ఒకటి ఫిల్మ్ నగర్ లో చక్కర్లు కొడుతోంది. ఇప్పటికే అభిజీత్ కోసం లవ్ స్టోరీస్ రెడీ అయ్యాయని .. ఆ హౌజ్ నుంచి రాగానే నిర్మాతలు అభిజీత్ ని హీరోగా పెట్టి సినిమా చేసేందుకు ప్లాన్ చేసుకుంటున్నారని అంటున్నారు. ముఖ్యంగా నాగార్జున సొంత నిర్మాణ సంస్థ అన్నపూర్ణ బ్యానర్ లో కూడా ఒక అభిజీత్ కోసం సిద్దం అయినట్టు నాగ్ నిర్మాతగా ఆ సినిమా మొదలు పెట్టబోతున్నట్టు సమాచారం.