అందుకే పరిపక్వత గల మనిషి.. వివాదంపై అభిజిత్ రియాక్షన్

Abhijeet comments on Sohel Mehaboob scam video

బిగ్ బాస్ ఫినాలే ఎపిసోడ్, చిరంజీవి నాగార్జునల సందడి, అభిజిత్ విన్నింగ్ మూమెంట్ ఇలా ఎన్ని ఉన్నా కూడా.. స్కాం వీడియోనే సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మెహబూబ్ ఏవేవో సైగలు చేయడం సోహెల్ పరీక్షగా చూడటం.. దాని వల్లే 25 లక్షల డీల్‌ను ఒప్పుకున్నాడని అందరూ అంటున్నారు. ఎలాగూ టైటిల్ విన్నర్ అభిజిత్ అని తెలుసుకున్న సోహెల్.. 25 లక్షలు తీసుకోవడమే ఉత్తమం అని అనుకున్నాడని కామెంట్లు చేస్తున్నారు.

Abhijeet comments on Sohel Mehaboob scam video
Abhijeet comments on Sohel Mehaboob scam video

సోహెల్ మూడో స్థానం అని చెప్పి హింట్ ఇవ్వడం, డబ్బులు తీసుకొని రా అని సైగలు చేయడం.. అభిజిత్‌ను చూపిస్తూ ఫస్ట్ ప్లేస్ అంటూ సైగలు చేయడం వంటివి ఆ వీడియోలో తెగ వైరల్ అవుతున్నాయి. వాటిపై సోహెల్ మెహబూబ్ ఎన్నో సార్లు క్లారిటీ ఇచ్చారు. అయితే ప్రతీసారి ఎక్కడో ఓదగ్గర దొరికిపోతున్నారు. ఓ సారి ఇన్ స్టా ఫాలోవర్ల గురించి అంటారు.. ఇంకోసారి మా పొజిషన్ల గురించే అడిగానని సోహెల్ చెబుతున్నాడు. ఇదిలా ఉంటే.. అభిజిత్ రియాక్షన్ మాత్రం వీర లెవెల్‌లో వైరల్ అవుతోంది.

ఆ వీడియో గురించి నాకు తెలియదు.. ఇప్పుడే చూస్తున్నాను.. అది వారి వ్యక్తిగతం.. అయినా అక్కడ ఏదైనా జరిగిందంటే.. స్టార్ మా వాళ్లు చూస్తారు.. లేదా ఎండమోల్ షైన్ వాళ్లు చూస్తారు.. అది నాకు సంబంధం లేదు..నేను టైటిల్,కప్ గెలిచాను.. నాకు అది చాలు.. డబ్బు ఇప్పుడు కాకపోతే రేపు. రేపు కాకపోతే ఓ నెల.. అది కూడా కాకపోతే ఓ ఏడాదిలో సంపాదించుకుంటాను అని అభిజిత్ హుందాగా స్పందించాడు. మరోసారి మెచ్యూర్డ్, పరిపక్వత గల మనిషి అని నిరూపించుకున్నాడు.