శివానీ నాగరం మంచి సింగర్‌..

‘అంబాజీపేట మ్యారేజి బ్యాండు’ చిత్రంతో హీరోయిన్‌గా పరిచయం అయిన తెలుగమ్మాయి శివాని నాగరం. సుహాస్‌ హీరోగా దుశ్యంత్‌ కటికినేని దర్శకత్వంలో ధీరజ్‌ మొగిలినేని నిర్మించిన ఈ చిత్రం ఫిబ్రవరి 2న రిలీజై మంచి విజయం దక్కించుకుంది. ఈ సినిమాలో హీరోయిన్‌ గా నటించిన శివాని తనదైన నటనతో..క్యూట్‌ ఎక్సప్రెషన్స్‌ తో ఆడియన్స్‌ మనసులని దోచేసింది. అయితే ఈ అమ్మడికి నటనలోనే కాదు..సింగర్‌ గా కూడా తన సినిమా ప్రస్థానాన్ని కొనసాగిస్తోంది.

లేటెస్ట్‌గా శివాని నాగరం సింగర్‌ గా అవతారమెత్తింది. ‘ఆరంభం’ అనే సినిమాలో శివాని ఓ బ్యూటిఫుల్‌ లవ్‌ సాంగ్‌ పాడింది. ‘అమాయకంగా హడావుడేమి లేక..తార చేరుకుందా ఇలా. అయోమయంగా తలాడించులాగ, నేల మారుతుందే ఎలా..కాలానికే కొత్త రంగు పూసే, మాయతార సొంతమేగా, హాయి సంతకాలు చేసేనా..’ అంటూ మంచి లవ్‌ ఫీల్‌ తో ఓ మంచి కంపోజిషన్‌ తో సాగుతుందీ ఈ పాట.

నిజానికి ఈ పాటకు మాత్రం శివాని నాగరం వాయిస్‌ స్పెషల్‌ అట్రాక్షన్‌ గా నిలిచిందిని చెప్పొచ్చు. రీసెంట్‌గా రిలీజ్‌ చేసిన ఈ పాట చాలా వినసొంపుగా ఉండటంతో పాటు లిరికల్‌ వీడియోలో శివాని నాగారం ఇచ్చిన పెర్ఫార్మన్స్‌ క్యూట్‌ గా తనవైపు తిప్పుకునేలా ఉంది.

ఇక టాలీవుడ్‌ లో హీరోయిన్స్‌ గా రాణిస్తూనే.. సింగర్స్‌ గా మారిన వాళ్ళు చాలానే ఉన్నారు. అందులో నిత్యావిూనన్‌, శ్రుతి హాసన్‌, ఎన్టీఆర్‌, తమిళ హీరో శింబు, సిద్దార్ధ్‌ సహా ఎంతోమంది అదిరిపోయే పాటలు పాడారు. మరి న్యూ టాలెంటెడ్‌ శివాని హీరోయిన్‌ గా.. సింగర్‌ గా ముందు ముందు ఎలా ఆకట్టుకుంటుందో చూడాలి. ఆరంభం సినిమా విషయానికి వస్తే..మోహన్‌ భగత్‌, సుప్రిత సత్యనారాయణ్‌, భూషణ్‌ కల్యాణ్‌, రవీంద్ర విజయ్‌ కీ రోల్స్‌ ప్లే చేస్తున్న మూవీ ఆరంభం. ఈ సినిమాను ఏవీటీ ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్‌పై అభిషేక్‌ వీటీ నిర్మిస్తున్నారు.