స్టార్ హీరో కూతురికి లైంగిక వేధింపులు.. ఏడాది త‌ర్వాత తెలుసుకున్న అస‌లు నిజం

మ‌న‌దేశంలో లైంగిక వేధింపులు రోజురోజుకు పెరుగుతూ పోతున్నాయి. కొంద‌రు ప్ర‌ముఖులు బహిరంగంగా ఈ విష‌యాల‌పై మాట్లాడుతూనే పోరాటం మొద‌లు పెట్టారు. మిస్ట‌ర్ ప‌ర్‌ఫెక్ట్ అమీర్ ఖాన్ త‌న‌య ఇరా ఖాన్ కూడా లైంగిక వేధింపుల‌కు గుర‌య్యాన‌ని తాజాగా వీడియో ద్వారా తెలియ‌జేసింది. ఇటీవ‌ల ప్రపంచ మానసిక ఆరోగ్యం దినోత్సవం సందర్బంగా తను నాలుగేళ్లకు పైగా మాన‌సిక ఒత్తిడిని ఎదుర్కొన్నాన‌ని చెప్పుకు రాగా, దానికి కార‌ణాలేంట‌ని నెటిజ‌న్స్ ఇరాని అని అడిగాడ‌రు. దీంతో ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియో పోస్ట్ చేస్తూ సంచ‌ల‌న విష‌యాలు చెప్పుకొచ్చింది.

ఇన్‌స్టాగ్రాములో పోస్ట్ చేసిన ప‌ది నిమిషాల వీడియో ద్వారా తాను ఎందుకు ఒత్తిడికి లోనైంద‌నే విష‌యాన్ని వివ‌రించింది. నేను కొన్ని రోజులుగా మాన‌సిక ఒత్తిడికి గ‌ల కార‌ణాల‌ని అన్వేషించడం మొద‌లు పెట్టాను.. స‌రైన కార‌ణాలు దొర‌క‌లేదు. అన్ని సౌక‌ర్యాలు ఉండ‌డం వ‌ల‌న నేను మీకు స‌రైన స‌మాధానం చెప్ప‌లేక‌పోయాను. మూడున్న‌రేళ్ళ క్రితం నా ప్ర‌వ‌ర్త‌న మార‌డం ప్రారంభ‌మైంది. దీంతో నా ప‌ట్ల నేను జాగ్ర‌త్త‌గా ఉన్నాను. ఒంట‌రిగానే ఉంటూ ఏదో ఆలోచిస్తూ ఉండేదాన్ని . నిద్ర‌కు ఎక్కువ స‌మ‌యం కేటాయించేదాన్ని. మంచం, గ‌ది నాకు ప్ర‌పంచం అయ్యేవి అంటూ ఇరా చెప్పుకొచ్చింది.

తల్లిదండ్రుల విడాకుల విషయంపై కూడా ఇరా.. నా త‌ల్లిదండ్రులు విడాకులు తీసుకున్న‌ప్పుడు చాలా చిన్న‌గా ఉన్నాను. వారి విడాకులు విష‌యం న‌న్ను బాధ‌పెట్ట‌లేదు. నాతోనే వారున్నార‌నే న‌మ్మ‌కం. ఈ విష‌యంలోను ఎప్పుడు ఒత్తిడికి గురి కాలేదు.అలానే 6 ఏళ్ళ వ‌య‌స్సులో క్ష‌య వ్యాధి వ‌చ్చింది. అప్పుడు డిప్రెష‌న్‌కు లోను కాలేదు. 14 ఏళ్ళ వ‌య‌స్సులో ఉన్న‌ప్పుడు ఓ వ్య‌క్తి న‌న్ను లైంగిక వేధింపుల‌కి గురి చేశాడు. అప్పుడు నాకు ఏం అర్ధం అయ్యేది కాదు. ఏం చేస్తున్నాడో కూడా తెలుసుకోలేని ప‌రిస్థితి. ఏడాది త‌ర్వాత విష‌యం అర్ద‌మైంది. వెంట‌నే మెయిల్ ద్వారా త‌ల్లిదండ్రుల‌కు తెలియ‌జేసి బ‌య‌ట‌ప‌డ్డాను. ఈ స‌మ‌స్య కూడా నాపై పెద్దగా ప్ర‌భావం చెప్ప‌లేదు అంటూ ప‌లు విష‌యాలు గురించి మాట్లాడిన ఐరా తాను నాలుగేళ్ళు ఎందుకు మాన‌సిక ఒత్తిడికి లోనైంది అనే విష‌యం మాత్రం చెప్ప‌లేదు.