ఆద్య తెలివి చూశారా.. కూతురు చేసిన పనికి రేణూ దేశాయ్ ఫిదా..!

Aadya Clicked A Pic Of Renu Desai

పరిచయం అక్కర్లేని పేరు రేణూ దేశాయ్. పవన్ కళ్యాణ్ మాజీ భార్యగా, అకీరా నందన్, ఆద్యల తల్లిగా మాత్రమే కాకుండా.. తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకుంది రేణూ దేశాయ్. ఓ రచయిత్రిగా, ఫ్యాషన్ డిజైనర్, దర్శకురాలిగా, హీరోయిన్‌గా ఇలా విభిన్న కోణాల్లో తన ప్రతిభను చాటుకుంటూ ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది. పవన్ కళ్యాణ్‌తో విడిపోయాక రేణూ దేశాయ్ సోషల్ మీడియాలో యాక్టివ్ అయింది.

Aadya Clicked A Pic Of Renu Desai

ఇక సోషల్ మీడియాలో రేణూ దేశాయ్ నిత్యం ఏదో ఒక పోస్ట్ చేస్తూనే ఉంటుంది. ఎక్కువగా తన పిల్లలైన అకీరా, ఆద్యల గురించి చెబుతూ ఉంటుంది. ముఖ్యంగా ఆద్య అల్లరి గురించి చెబుతూ ఉంటుంది. ఈ లాక్డౌన్‌లో ఆద్య ఎలా ఉంది? ఏం నేర్చుకుంది? వంటి వాటి గురించి చెబుతూ వచ్చింది. ఆద్య ఈ వయసులోనే వంటలు నేర్చుకోవడంపై దృష్టిపెట్టడంతో రేణూదేశాయ్ ఎంతో సంతోషించింది. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ సంబరపడిపోయింది.

Aadya Clicked A Pic Of Renu Desai

ఇక ఆద్యలో మరో టాలెంట్ కూడా దాగి ఉన్న సంగతి తెలిసిందే. ఆద్యకు ఫోటోగ్రఫీలో ఉన్న ఇంట్రెస్టెంట్.. టాలెంట్ అందరికీ తెలిసిందే. రేణూ దేశాయ్ షేర్ చేసే ఫోటోల్లో దాదాపు ఆద్య తీసినవే అని చెబుతూ ఉంటుంది. తాజాగా ఆద్య క్రియేటివిటీని చూసి రేణూ దేశాయ్ మురిసిపోతోంది. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో తాను సముద్రం దగ్గరికి వెళ్లలేనని, సముద్రాన్నే తన వద్దకు తీసుకొచ్చిందని, ఆద్య ఫోటోగ్రఫీ ఎడిటింగ్ టాలెంట్ చూసి రేణూ దేశాయ్ సంతోషంలో మునిగితేలుతోంది.