AA 22: పుష్ప ఫినిష్ అయిన వెంటనే..

పుష్ప సినిమాతో బిగ్ అందుకున్న అల్లు అర్జున్ ఇప్పుడు అంతకుమించి అనేలా సక్సెస్ అందుకునేందుకు పుష్ప 2ని సిద్ధం చేస్తున్నాడు. సుకుమార్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా తప్పకుండా పాన్ ఇండియా బాక్సాఫీస్ వద్ద ఒక రేంజ్ లో బజ్ క్రియేట్ చేయడం పక్కా అనే కామెంట్స్ వస్తున్నాయి.

అయితే ఆ సినిమా తరువాత బన్నీ ఎలాంటి సినిమాతో వస్తాడు అనేది కూడా ఆసక్తిని కలిగిస్తోంది. ఇప్పటికే సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో సినిమా చేయనున్నట్లు అధికారికంగా క్లారిటీ ఇచ్చారు. అయితే అది మొదలవ్వడానికి కాస్త సమయం పట్టే ఛాన్స్ ఉంది. ఇక బన్నీ మాత్రం నెక్స్ట్ తన 22వ సినిమాను త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో స్టార్ట్ చేయాలని చూస్తున్నాడు.

ఈ ప్రాజెక్ట్ గీత ఆర్ట్స్ – సితార ఎంటర్టైన్మెంట్స్ లో నిర్మించనున్నారు. త్రివిక్రమ్ పక్కా ప్రణాళికతో జెట్ స్పీడ్ లోనే ఆ ప్రాజెక్ట్ ఫినిష్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఆ సినిమా షూటింగ్ 2024 సమ్మర్ అనంతరం స్టార్ట్ కావచ్చని గీత ఆర్ట్స్ కు చెందిన బన్నివాసు ఒక హింట్ అయితే ఇచ్చారు. ఈసారి కేవలం ఎంటర్టైన్మెంట్ కాకుండా త్రివిక్రమ్ యాక్షన్ డోస్ గట్టిగానే ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం త్రివిక్రమ్ మహేష్ బాబుతో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఆ సినిమా 2024 సంక్రాంతికి విడుదల కానుంది.