Mahesh, vijay : పోటీపడుతున్న మహేష్, విజయ్ అభిమానులు.. పై చేయి సాధించాలని ఆరాటం..!

 

Mahesh, Vijay: టాలీవుడ్ లో మహేష్ బాబు ఎంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుందో కోలీవుడ్ లో దళపతి విజయ్ కు కూడా ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువే. సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన సర్కార్ వారి పాట సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది,అలాగే విజయ్ నటించిన బీస్ట్ సినిమా కూడా విడుదలకు సిద్ధంగా ఉంది. అయితే సూపర్ స్టార్ మహేష్ బాబు కి, దళపతి విజయ్ కి మధ్య ఎటువంటి గొడవలు లేవు. కాగా మహేష్ బాబు సినిమాలన్నీ దళపతి తమిళ్ లో రీమేక్ చేస్తూ ఉంటారు. కానీ వీరి ఫ్యాన్స్ వలన మాత్రం వీరికి తప్పేలా లేదు.

స్టార్ హీరోల మధ్య గొడవలు ఏమి ఉండవు కానీ ఫ్యాన్స్ మాత్రం వాళ్ల సినిమాల గురించి గొడవ పడుతుంటారు. మహేష్ బాబు దళపతి విజయ్ సినిమాలకు ఇప్పుడు పోటీ నడుస్తోంది.మహేష్ బాబు నటిస్తున్న సర్కారు వారి పాట, విజయ్ నటిస్తున్న బీస్ట్ సినిమాల మధ్య పోటీ కొనసాగుతూనే ఉంది.

ఈ రెండు సినిమాలు ఈ ఏడాది సమ్మర్ లోనే రిలీజ్ కానున్నాయి. సినిమాలు మాత్రమే ఒకేసారి రావడం లేదు..  ఈ సినిమాలోని పాటలు మాత్రం ఒకేసారి రిలీజ్ అవుతున్నాయి.ఇప్పటికే ఈ రెండు సినిమాల నుండి మొదటి పాట ఒకేసారి వచ్చింది.. అయితే బీస్ట్ సినిమాలో అరబిక్ కుత్తు మాత్రం కళావతి కంటే పైచేయి సాధించింది. రెండవ పాట కూడా ఒకేసారి రాబోతుంది. బీస్ట్ నుండి 19న వస్తుంటే..సర్కారు నుండి 20న పాట రాబోతుంది.. ఇలా రెండవ పాట కూడా అను కోకుండానే ఒకేసారి రిలీజ్ చేస్తున్నారు  చిత్ర బృందం . ఈ సారి ఎవరిది పై చేయి అవుతుందో చూడాలి.