స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో పుష్ప 2 మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. పుష్పకి సీక్వెల్ గా ఈ మూవీ భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుంది. ఇదిలా ఉంటే మొదటి సినిమాకి మించి ఈ సినిమాతో కలెక్షన్స్ రాబట్టాలనే లక్ష్యంతో సుకుమార్ ఈ మూవీని గ్రాండియర్ గా ఆవిష్కరించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ నేపధ్యంలో బడ్జెట్ కూడా పెరిగిందని తెలుస్తుంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా సాగుతుంది.
ఇదిలా ఉంటే ఈ సినిమా నుంచి అల్లు అర్జున్ పుట్టిన రోజు సందర్భంగా అదిరిపోయే సర్ప్రైజ్ ఇవ్వడానికి దర్శకుడు సుకుమార్ రెడీ అవుతున్నట్లు టాక్. ప్రత్యేకంగా మూవీ స్పెషల్ టీజర్ గ్లిమ్స్ ని రిలీజ్ చేసే యోచనలో ఉన్నట్లు సమాచారం. ఈ టీజర్ తో దేశం వ్యాప్తంగా సినిమాపై భారీ హైప్ క్రియేట్ చేయాలని అనుకుంటున్నారు. పుష్ప మూవీ నార్త్ ఇండియా లో సెన్సేషన్ బ్లాక్ బస్టర్ హిట్ అయిన నేపధ్యంలో ఈ పార్ట్ 2 మీద కూడా భారీ హైప్ క్రియేట్ అయ్యి ఉంది.
ఇప్పటికే ఈ మూవీ హిందీ రైట్స్ ని భారీ డిమాండ్ ఏర్పడింది అని బిటౌన్ లో వినిపిస్తుంది. ఇక స్టైలిష్ స్టార్ పుట్టిన రోజు సందర్భంగా రిలీజ్ చేయబోయే గ్లిమ్స్ ని అటు ఫ్యాన్స్ కి సర్ప్రైజింగ్ గా అందించడంతో పాటు పాటు సినిమాకి బిజినెస్ పరంగా హెల్ప్ అయ్యేలా సుకుమార్ ప్లాన్ చేస్తున్నారు. అందులో భాగంగా పవర్ ఫుల్ మాస్ గ్లిమ్స్ ని సిద్ధం చేస్తున్నట్లు ఫిల్మ్ నగర్ సర్కిల్ లో చెప్పుకుంటున్నారు.
పుష్ప2తో వెయ్యి కోట్ల టార్గెట్ ని అందుకోవాలని అల్లు అర్జున్, సుకుమార్ స్కెచ్ వేస్తున్నారని టాక్. దీనిని దృష్టిలో ఉంచుకొని మూవీని కేవలం ఐదు భాషలలోనే కాకుండా వీలైనన్ని ఎక్కువ ఇండియన్ భాషలలో రిలీజ్ చేయడానికి కూడా ప్లాన్ చేస్తున్నారు. ఇలా చేయడం ద్వారా మూవీకి మరింతగా మార్కెట్ పెరిగి సినిమా కలెక్షన్స్ కూడా పెరిగే అవకాశం ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఇక ఏప్రిల్ 8న రిలీజ్ చేయబోయే మూవీ గ్లిమ్స్ కచ్చితంగా సినిమాని దేశీయ మార్కెట్ లోకి పవర్ ఫుల్ గా తీసుకొని వెళ్లి హై బజ్ క్రియేట్ చేస్తుందని భావిస్తున్నట్లు టాక్.