ఓ స్టార్‌ ప్రొడ్యూసర్‌ మోసం చేశాడు… లబోదిబోమన్న హీరోయిన్‌ మాల్వీ మల్హోత్రా!?

సినిమా ఇండస్ట్రీలో రాణించడం అంతా సులభం కాదు.. చాలా మంది ఎన్నో కష్టాలు ఎదుర్కొని సినిమాల్లో రాణిస్తూ ఉంటారు. కొంతమంది సినిమాలోకి రావడానికి ఇబ్బంది పడితే.. మరికొంతమంది సినిమాల్లోకి వచ్చిన తర్వాత కొన్ని తమ చుట్టూ జరుగుతున్న సంఘటనల వల్ల ఇబ్బంది పడుతుంటారు.

తాజాగా తాను కూడా.. ఓ స్టార్‌ ప్రొడ్యూసర్‌ కారణంగా ఇబ్బంది పడ్డానని.. ఇంకో మాటలో చెప్పాలంటే మోసపోయానని అంటోంది హీరోయిన్‌ మాల్వీ మల్హోత్రా.. మాల్వీ మల్హోత్రా! బుల్లితెర నుంచి సినిమాల్లోకి అడుగుపెట్టిన ఈ బ్యూటీ తనకొచ్చిన సినిమాలు చేసుకుంటూ పోతోంది.

యంగ్‌ హీరో రాజ్‌ తరుణ్‌ సరసన ‘తిరగబడరా సావిూ’ తెలుగు మూవీలోనూ నటిస్తోంది. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఈ మూవీ ప్రమోషన్‌ కార్యక్రమాల్లోనే ఓ బాలీవుడ్‌లో తనకు ఎదురైన ఓ చేదు సంఘటన గురించి చెప్పి..లబోదిబో మంది.