సౌత్ సినీ ఇండస్ట్రీలో మోస్ట్ ఎనర్జిటిక్, రొమాంటిక్ హీరో కమల్ హాసన్ గారిది ప్రత్యేక స్థానం అని చెప్పొచ్చు. విభిన్నమైన నటన సరళితో కొన్ని సంవత్సరపాటు తమిళ్ తెలుగు ఇండస్ట్రీలో అగ్ర కథానాయకుడిగా కొనసాగిన కమల్ హాసన్ కొన్ని సినిమాలకు దర్శకులుగా నిర్మాతగా కూడా వ్యవహరించారు. చాలా సంవత్సరాల సరైన హిట్టు లభించక అజ్ఞాతంలో ఉన్న కమలహాసన్ ఇటీవలే విక్రమ్ సినిమాతో బ్లాక్ బాస్టర్ హిట్ అందుకని కుర్ర హీరోలకు దీటుగా తన సత్తాను మరొక్కసారి నిరూపించుకున్నాడు అని చెప్పొచ్చు.
కమల్ హాసన్ ఒడిదుడుకుల సినీ ప్రస్థానంలో కోట్ల ఆస్తిని సంపాదించుకున్నారని చెప్పొచ్చు. కమలహాసన్ కూతురు శృతిహాసన్ నీ కూడా హీరోయిన్ చేసి నటన మీద తనకున్న మక్కువను నిరూపించుకున్నాడు. ప్రస్తుతం శృతిహాసన్ స్టార్ హీరోయిన్ గా కొనసాగుతోంది అన్న విషయం మనందరికీ తెలిసిందే.
శృతిహాసన్ నటనపరంగానే కాకుండా అన్ని విషయాల్లోనూ తన తండ్రి కమల్ హాసన్ ను మించిపోయిందని సినీ ఇండస్ట్రీలో మరియు సోషల్ మీడియాలో టాక్ నడుస్తోంది.
కమల్ హాసన్ యువ హీరోగా ఉన్నప్పుడు ఎందరో హీరోయిన్లతో రొమాన్స్ చేశాడని ఎన్నో వివాదాలు ఇప్పటికీ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూనే ఉంటాయి. అదే మిస్టేక్ ను శృతిహాసన్ కూడా తరచూ బాయ్ ఫ్రెండ్స్ ను మారుస్తూ ఫ్యాన్స్ కు చికాకు కలిగిస్తోంది. ఎన్నో కోట్లు సంపాదించిన కమల్ హాసన్ కు ఒక కోరిక మిగిలిపోయిందని తరచూ సోషల్ మీడియాలో వార్త వినిపిస్తోంది. శృతిహాసన్ కు పెళ్లి చేసి తన బాధ్యతను నిర్వర్తించాలని కమల్ హాసన్ భావిస్తున్నాడట.
అందరూ పెద్దవాళ్లలాగే కమల్ హాసన్ కూడా మనవళ్ళు మనవరాలతో ఆడుకోవాలని ఎప్పటినుంచి కోరుకుంటున్నాడు. పైగా కమల్ హాసన్ కు ముందు నుంచి చిన్న పిల్లలంటే చాలా ఇష్టం. చాలాసార్లు కమల్ హాసన్ తన కూతురు శృతిహాసన్ దగ్గర పెళ్లి ప్రస్తావన తీసుకొచ్చినప్పుడు సరైన సమాధానం చెప్పకుండా దాటవేస్తోందని బాధపడుతున్నారు. ఇలా అయితే కమల్ హాసన్ మనవాళ్లు, మనవరాళ్లుతో ఆడుకోవాలనే కోరిక ఎప్పటికీ నెరవేరుతుందో వేచి చూడాలి మరి..