‘ఎన్టీయార్30’ కోసం మరో హీరోయిన్.!

అసలు జాన్వీ కపూర్ ఒప్పుకుంటుందా.? లేదా.? అన్న అనుమానాలకు తెరపడి, ఆమె ఒప్పుకోవడమే కాదు, ‘ఎన్టీయార్30’ సినిమా ప్రారంభోత్సవానికీ హాజరయ్యింది. తెలుగులోకి తొలిసారిగా ఎంట్రీ ఇస్తోంది జాన్వీ కపూర్ ఈ సినిమాతో.

కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీయార్ హీరోగా తెరకెక్కుతున్న సినిమా ‘ఎన్టీయార్30’ పూజా కార్యక్రమాలు ఇంకోసారి జరిగాయి. త్వరలో సినిమా సెట్స్ మీదకు వెళ్ళనుంది.

ఇంతలోనే, ఓ ఇంట్రెస్టింగ్ గాసిప్ ప్రచారంలోకి వచ్చింది. ఈ సినిమాలో మరో హీరోయిన్ కూడా వుంటుందట. ఆమె ఎవరన్నదానిపై ఇంకాస్త స్పష్టత రావాల్సి వుంది. త్వరలోనే పూర్తి వివరాలు వెల్లడి కానున్నాయట.

కొరటాల శివ మార్క్ మాస్ కమర్షియల్ ఎలిమెంట్స్ సినిమాలో వుంటాయనే ప్రచారం జరుగుతుండగా, డార్క్ థీమ్‌లో సినిమా రూపొందనుందనే గాసిప్స్ కూడా వినిపిస్తున్నాయి. కాగా, రెండో హీరోయిన్‌కి సినిమాలో తక్కువ స్కోప్ వుంటుందనీ, ఓ మేజర్ ట్విస్ట్ ఆమె పాత్ర చుట్టూ వుండబోతోందనీ సమాచారం.