ప్రభాస్ .. రాధే శ్యామ్ నుంచి మరికొన్ని గంటల్లో స్పెషల్ సర్‌ప్రైజ్ ..?

ప్రభాస్ .. రాధే శ్యామ్ నుంచి ఫ్యాన్స్ తో పాటు ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటి వరకు ప్రభాస్ రాధే శ్యామ్ నుంచి వచ్చిన టైటిల్ పోస్టర్ అండ్ ఫస్ట్ లుక్, అలాగే ప్రభాస్ విక్రమాదిత్య పోస్టర్ .. పూజా హెగ్డే ప్రేరణ పోస్టర్ తో పాటు బీట్స్ ఆఫ్ రాధే శ్యామ్ ఫ్యాన్స్ ని బాగా ఆకట్టుకున్నాయి. ఈ పోస్టర్స్ అండ్ బీట్స్ ఆఫ్ రాధే శ్యామ్ గురించి యాంటీ ఫ్యాన్స్ కొన్ని కామెంట్స్ చేసినా అవి ఏ మూలకి చేరుకున్నాయో తెలియదు. అయితే సినీ వర్గాలలో అలాగే ప్రేక్షకుల్లో మాత్రం వీటన్నిటికి పాజిటివ్ రెస్పాన్స్ దక్కింది.

Prabhas's 'Radhe Shyam' first look goes viral

ఇక రాధే శ్యామ్ లో ప్రభాస్ – పూజా హెగ్డే అమర ప్రేమికులుగా నటిస్తున్నారని సమాచారం. ఆ విషయాన్ని తెలిపేందుకే మేకర్స్ బీట్స్ ఆఫ్ రాధే శ్యామ్ ని హింట్ గా రిలీజ్ చేశారు. యంగ్ డైరెక్టర్ రాధకృష్ణ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న రాధే శ్యామ్ ని ప్రభాస్ పెదనాన్న రెబల్ స్టార్ కృష్ణం రాజు సమర్పణలో గోపీకృష్ణ మూవీస్ – యూవి క్రియేషన్స్ సంయుక్తంగా 250 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఇక రీసెంట్ గా ఈ సినిమా కంప్లీట్ చేసిన ప్రభాస్ ప్రస్తుతం సలార్ సినిమా కోసం సిద్దమవుతున్నాడు. ఈ క్రమంలో రాధే శ్యామ్ చిత్ర బృందం న్యూ ఇయర్ సందర్భంగా ఫ్యాన్స్ కి స్పెషల్ సర్‌ప్రైజ్ ఇవ్వబోతున్నట్టు దర్శకుడు సోషల్ మీడియా ద్వారా తెలిపాడు.

దాంతో డార్లింగ్ ఫ్యాన్స్ ఇప్పుడు న్యూ ఇయర్ ఎప్పుడొస్తుందా గంటలు లెక్కపెట్టుకుంటున్నారు. మరి ఆ స్పెషల్ సర్‌ప్రైజ్ ఏమై ఉంటుందో అని అందరిలో ఆతృత విపరీతంగా పెరిగిపోయింది. కాగా విశ్వసనీయ వర్గాల ద్వారా అందుకున్న సమాచారం ప్రకారం రాధే శ్యామ్ నుంచి టీజర్ వచ్చే అవకాశాలున్నాయని తెలుస్తోంది. మరి ఈ స్పెషల్ సర్‌ప్రజ్ అన్న ఫ్యాన్స్ ని వందశాతం శాటిసిఫై చేస్తుందా లేక మళ్ళీ ట్రోల్స్ కి గురౌతుందా చూడాలి. ఇక న్యూ ఇయర్ లో ప్రభాస్ సలార్ తో పాటు బాలీవుడ్ స్ట్రైట్ మూవీ ఆదిపురుష్ ని సమాతరంగా చేయబోతున్నాడు. అంతేకాదు సలార్ సినిమాని కేవలం 4 నెలల్లో కంప్లీట్ చేస్తాడని తెలుస్తోంది.