డోంట్ మిస్ : ఈరోజు నుంచి “భగవంత్ కేసరి” థియేటర్స్ లో స్పెషల్ సర్ప్రైజ్ 

టాలీవుడ్ లో ఈ దసరా కానుకగా వచ్చిన లేటెస్ట్ చిత్రాల్లో అయితే నందమూరి నటసింహ టాలీవుడ్ మాస్ గాడ్ బాలకృష్ణ నటించిన రోరింగ్ హిట్ చిత్రం “భగవంత్ కేసరి” కూడా ఒకటి. మరి భారీ అంచనాలు నడుమ రిలీజ్ కి వచ్చిన ఈ సీమ సూపర్ సక్సెస్ అయ్యి ఇప్పటికీ మంచి వసూళ్ళని రాబడుతుంది.

తెలుగు వరకు అయితే వీకెండ్ మరియు పండగ రోజులని కూడా బాగా క్యాష్ చేసుకుంటున్న ఈ చిత్రంపై ఓ క్రేజీ న్యూస్ ఇప్పుడు బయటకి వచ్చింది. ఈ చిత్రం రిలీజ్ ముందే దర్శకుడు అనీల్ రావిపూడి అయితే ఓ సర్ప్రైజ్ దసరా కానుకగా తాము పెడుతున్నాము అని ముందు జెన్యూన్ గా ఎంజాయ్ చేద్దాం తర్వాత పండుగని సెలబ్రెట్ చేసుకుందాం అంటూ తెలిపాడు.

మరి ఫైనల్ గా అనుకున్నట్టుగానే ఆ సాంగ్ ఇప్పుడు థియేటర్స్ లోకి వచ్చేసింది. బాలయ్య చార్ట్ బస్టర్ సాంగ్ దంచవే మేనత్త కూతురా సాంగ్ కి రీమిక్స్ ని అయితే మేకర్స్ రీ క్రియేట్ చేసి థియేటర్స్ లో ఈరోజు నుంచి వదిలారు. దీనితో ఈ సాంగ్ ఇప్పుడు బాలయ్య ఫ్యాన్స్ కి డబుల్ ధమాకాగా మారింది.

ఇక మేకర్స్ కూడా దీనిని కన్ఫర్మ్ చేస్తూ ఈరోజు నుంచి భగవంత్ కేసరి ఆడుతున్న థియేటర్స్ లో ఈ సాంగ్ తో కూడా ప్రింట్ ఉంటుంది అని తెలిపారు. మొత్తానికి అయితే నేటి నుంచి బాలయ్య ఫ్యాన్స్ కి మరో పండుగ అని చెప్పాలి. ఇంకా ఈ చిత్రంలో హీరోయిన్ గా కాజల్ నటించగా నటి శ్రీలీల బాలయ్య కూతురిగా నటించింది. అలాగే ఈ సినిమాకి థమన్ సంగీతం అందించాడు. 
https://twitter.com/Shine_Screens/status/1716765064408293616