సరికొత్త బాలయ్య, శృతిహాసన్ లతో “వీర సింహా రెడ్డి” ఎనర్జిటిక్ నెంబర్.!

వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో రిలీజ్ కి రెడీగా ఉన్న చిత్రాల్లో నందమూరి బాలకృష్ణ అలాగే శృతి హాసన్ లు హీరో హీరోయిన్స్ గా నటిస్తున్న మాస్ ఫ్యాక్షన్ అండ్ ఏక్షన్ డ్రామా “వీరసింహా రెడ్డి”. హిట్ దర్శకుడు గోపీచంద్ మలినేని తెరకెక్కిస్తున్న ఈ చిత్రంపై మంచి అంచనాలు నెలకొనగా ఈ చిత్రం నుంచి వచ్చిన ఫస్ట్ సాంగ్ ఆల్రెడీ అదరగొట్టింది.

ఇక దీనితో నెక్స్ట్ మాత్రం రిలీజ్ చేయనున్న ఫస్ట్ డ్యూయెట్ సాంగ్ సుగుణ సుందరి పై కూడా మంచి అంచనాలు ఉన్నాయి. అయితే చిత్ర యూనిట్ అనుకున్నట్టే సరైన సమయానికి ఈ సాంగ్ ని రిలీజ్ చేయగా ఈ సాంగ్ లో మాత్రం ఇది వరకు చూడని బాలయ్య, శృతి హాసన్ లను మనం చూడొచ్చు.

ఇద్దరి ఎనర్జీ గాని ఇద్దరు డాన్స్ వారి మధ్య కెమిస్ట్రీ ఓ రేంజ్ లో కనిపిస్తున్నాయి. సీన్స్ లో ఎలా ఉంటారో కానీ ఈ సాంగ్ లో మాత్రం ఇద్దరు మంచి హైలైట్ అయ్యారు. ఇక ఈ సాంగ్ కూడా జై బాలయ్య తర్వాత హిట్ సాంగ్ అనిపించుకునే రేంజ్ లో ఉంది. థమన్ ఇచ్చిన సంగీతం దానికి తగ్గట్టుగా డాన్స్ లు ఈ సాంగ్ లో కనిపిస్తున్నాయి.

అలాగే బాలయ్య యాటిట్యూడ్ కూడా ఈ సాంగ్ లో హైలైట్ కాగా శేఖర్ వీజే బాలయ్య కోసం ఓ సిగ్నేచర్ స్టెప్ కూడా చేసాడు. ఇలా ఓవరాల్ గా మాత్రం ఈ సాంగ్ కూడా సరికొత్తగా కనిపిస్తూ ఇంప్రెస్ చేస్తుంది. ఇక మైత్రి మేకర్స్ తెరకెక్కించిన ఈ చిత్రం ఈ జనవరి 12న గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది.
Veera Simha Reddy - Suguna Sundari Lyric | Nandamuri Balakrishna | Shruti Haasan, ThamanS