ట్విస్ట్ : అపుడే “మెగా 156” ఆల్బమ్ పై మాసివ్ రివీల్..!

ఇప్పుడు దసరా కానుకగా అయితే ఈరోజు టాలీవుడ్ నుంచి ఎన్నో పలు భారీ చిత్రాలు నుంచి సాలిడ్ అప్డేట్స్ వస్తుండగా ఈ అప్డేట్స్ లో అయితే దిగ్గజ సీనియర్ హీరో టాలీవుడ్ మాస్ మూలవిరాట్ మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న సెన్సేషనల్ ప్రాజెక్ట్ మెగా 156 కూడా ఒకటి.

అయితే ఇది మెగాస్టార్ 157వ సినిమా కాగా దీనిని పరిస్థితుల రీత్యా ముందుకు జరిపారు. కాగా ఈ సినిమా నుంచి నిన్న క్రేజీ అప్డేట్ ఇచ్చిన మేకర్స్ ఇప్పుడు ఈరోజు దసరా కానుకగా ఐతే ఓ వీడియోని రిలీజ్ చేస్తున్నట్టుగా తెలిపారు. కానీ ఈ మధ్యాహ్నం వచ్చిన వీడియోలో దీనితో పాటిగా ఓ క్రేజీ ట్విస్ట్ కూడా అందించడం విశేషం గా మారింది.

కాగా ఈ సినిమా కి సంగీత దర్శకుడు కీరవాణి ఇచ్చిన ట్విస్ట్ వైరల్ గా మారింది. కాగా వీడియో స్టార్టింగ్ లోనే సినిమా మ్యూజిక్ ఆల్బమ్ పై బిగ్ అప్డేట్ ని అందించారు. తాను మాట్లాడుతూ ఈ చిత్రంలో 6 పాటలు ఉన్నాయని అలాగే ఇప్పుడుకి ఈ 6 అని కన్ఫర్మ్ చేశారు అంటే ఈ సినిమాలో ఇంకా ఎక్కువే ఉండొచ్చు అని చెప్పాలి.

ఇక దీనితో పాటుగా ఇంకో ఇంట్రెస్టింగ్ అప్డేట్ అందించారు. కాగా ఏ సినిమా అయినా ఇంకోలా మొదలవుతుంది కానీ తాము ఈ చిత్రాన్ని ఓ సాంగ్ తో గ్రాండ్ సెలెబ్రేషన్ తో స్టార్ట్ చేయాలని డిసైడ్ అయ్యాయని మా దర్శకుడు వసిష్ఠ ఇలా ప్లాన్ చేసాడని రివీల్ చేశారు. దీనితో మెగా 156 పై ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఈరోజు బయటకి వచ్చింది అని చెప్పాలి.