ఇండస్ట్రీ టాక్ : “ఓజి” సినిమాకి అసలైన టైటిల్ ఫిక్స్ చేశారట.. 

టాలీవుడ్ కా గాడ్ ఆఫ్ మాసెస్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా ఇప్పుడు చేస్తున్న పలు భారీ చిత్రాల్లో యువ దర్శకుడు అందులోకి తన ఫ్యాన్ దర్శకుడు అయినటువంటి సుజీత్ తెరకెక్కిస్తున్న భారీ ఏక్షన్ డ్రామా “ఓజి” కూడా ఒకటి. కాగా ఈ చిత్రంపై ఎనలేని అంచనాలు నెలకొనగా షూటింగ్ కూడా దాదాపు 75 శాతం కంప్లీట్ చేసేసారు.

ఇక పవన్ నుంచి కేవలం కొన్ని రోజులు డేట్స్ ఉంటే చాలు సినిమా కంప్లీట్ చేసేస్తారు అని సినీ వర్గాల్లో సమాచారం. కాగా ఈ చిత్రాన్ని ఇన్ని రోజులు ఓజి, ఓజి అని అంటున్నారు కానీ ఇది అధికారిక టైటిల్ అయితే కాదు సినిమాకి వేరే టైటిల్ ఉందని ఎప్పుడో మేకర్స్ చెప్పారు.

కానీ అభిమానులకి ఓజి అనే టైటిల్ గానే రిజిస్టర్ కావడంతో దీనినే కంటిన్యూ చేశారు. కాగా ఇప్పుడు ఈ చిత్రానికి అసలు టైటిల్ ని చిత్ర నిర్మాణ సంస్థ డీవీవీ వారు లాక్ చేసినట్టుగా సినీ వర్గాల్లో న్యూస్ వినిపిస్తుంది. దీనితో మేకర్స్ ఈ సినిమాకి “హంగ్రీ చీతా” అనే క్రేజీ టైటిల్ ని ఫిక్స్ చేసినట్టుగా తెలుస్తోంది.

దీనిపై ఇక అధికారిక క్లారిటీ మాత్రం రావాల్సి ఉంది. ఇంకా ఈ చిత్రంలో ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటిస్తుండగా థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నాడు. అలాగే ఈ ఏడాదిలోనే ఈ చిత్రం రిలీజ్ ని ప్లాన్ చేస్తున్నారు. అలాగే ప్రస్తుతానికి అయితే ఈ సెప్టెంబర్ 27న పాన్ ఇండియా లెవెల్లో విడుదలకి తీసుకున్నారని భోగట్టా..