అఖిల్ తో భారీ మల్టీ స్టార్ చిత్రం..ఘోస్ట్ ప్రీ రిలీజ్ వేడుకగా క్లారిటీ ఇచ్చిన నాగార్జున!

అక్కినేని నాగార్జున ప్రస్తుతం వరుస సినిమాలతో ఎంతో బిజీగా గడుపుతున్నారు. ఈయన తన కొడుకులతో పోటీగా వరుస సినిమాలలో నటిస్తూ ఇండస్ట్రీలో ఎంతో బిజీగా ఉన్నారు. ఈ క్రమంలోనే నాగార్జున తాజాగా ప్రవీణ్ సత్తార్ దర్శకత్వంలో నటిస్తున్నటువంటి చిత్రం ది ఘోస్ట్. ఈ సినిమా అక్టోబర్ 5వ తేదీ ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకను కర్నూలులో ఎంతో ఘనంగా నిర్వహించారు.ఇక ఈ కార్యక్రమానికి తన కుమారులు ఇద్దరినీ ముఖ్య అతిథులుగా నాగార్జున తీసుకువచ్చి వేదికపై తండ్రి కొడుకులు పెద్ద ఎత్తున సందడి చేశారు.

ఇదిలా ఉండగా ఈ కార్యక్రమంలో భాగంగా నాగార్జున మాట్లాడుతూ తాను ఈ ఏడాది మొదట్లో నాగచైతన్యతో కలిసి బంగార్రాజు సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చాను అయితే త్వరలోనే అఖిల్ తో కలిసి మరోసారి చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నానని ఈ సందర్భంగా ఈయన అఖిల్ తో తాను చేయబోయే సినిమా గురించి ప్రకటించారు. ఇకపోతే ఈ సినిమా ఎలా ఉంటుంది అనే విషయం గురించి నాగార్జున మాట్లాడుతూ…ఘోస్ట్, ఏజెంట్ సినిమాలు కలిస్తే ఎలా ఉంటుందో ఆ సినిమా కూడా అలాగే ఉండబోతుందని త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన అన్ని విషయాలు అధికారికంగా వెల్లడిస్తామని తెలిపారు.

ఇకపోతే ది ఘోస్ట్ సినిమా గురించి నాగార్జున మాట్లాడుతూ అక్టోబర్ 5వ తేదీ గత 30 సంవత్సరాల క్రితం చైన్ పట్టుకొని ప్రేక్షకుల ముందుకు వచ్చాను అయితే అప్పుడు నన్ను బాగా ఆదరించారు. ఈ క్రమంలోనే 30 సంవత్సరాల తర్వాత అదే అక్టోబర్ 5వ తేదీ కత్తి పట్టుకొని మీ ముందుకు వస్తున్నాను ఇప్పుడు కూడా ఆదరిస్తారని కోరుకుంటున్నాను అంటూ ఈ సందర్భంగా ఘోస్ట్ సినిమా గురించి ఈయన ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.