NTR: ఎన్టీఆర్ రామ్ చరణ్ తో కలిసి నటించిన ప్రతిష్టాత్మక చిత్రం ఆర్ ఆర్ ఆర్ మార్చి 25న విడుదల కాబోతోంది. దీనికి సంబంధించిన ప్రమోషన్ లో ఎన్టీఆర్ రామ్ చరణ్ రాజమౌళి చురుగ్గా పాల్గొంటున్నారు. ఆర్ ఆర్ ఆర్ సినిమా మొదలుపెట్టినప్పటి నుంచి ఇప్పటివరకు మరొక సినిమా ఎన్టీఆర్ చేయలేదు. మూడేళ్ల తర్వాత ఎన్టీఆర్ సినిమా రాబోతోంది. రామ్ చరణ్ మెగాస్టార్ చిరంజీవి కలిసి నటించిన ఆచార్య సినిమా కూడా విడుదలకు సిద్ధంగా ఉంది.
ప్రస్తుతం ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వంలో ఓ చిత్రాన్ని మొదలెడుతున్నారు అని వార్తలు వచ్చాయి కానీ అది ఇంకా పట్టాలెక్కలేదు.ఆచార్య సినిమా పూర్తయిన తర్వాత ఎన్టీఆర్ కొరటాల శివ కాంబినేషన్లో వస్తున్న చిత్రం మొదలుపెడతారు. ఎన్టీఆర్ అభిమానులు మాత్రం హీరో సినిమాలు చాలా నెమ్మదిగా రావడంతో ఫాన్స్ అసంతృప్తిగా ఉన్నారు. ఈ విషయం తెలుసుకున్న ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాను మరియు ఒకేసారి చేయాలని నిర్ణయించుకున్నారట.
ఎన్టీఆర్ ఫ్యాన్స్ కోసం సైలెంట్ గానే బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసే ఆలోచనలో ఉన్నారట. అందులోనూ భవిష్యత్ సినిమాలన్నీ పాన్ ఇండియా సినిమాలు కావడం విశేషం. అంతేకాదు కేజిఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీళ్లతో కూడా ఎన్టీఆర్ సినిమా చేయాల్సి ఉంది. కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న సినిమాల తర్వాత ప్రశాంత్ నీల్ సినిమా ఉండే అవకాశం ఉంది. ప్రస్తుతం అయితే ఆర్ఆర్ ఆర్ సినిమాతో ఎన్టీఆర్ హిట్ ని తన ఖాతాలో వేసుకోవడం గ్యారెంటీ. ఇలాఎన్టీఆర్ సైలెంట్ గా ఉంటూ వరుసగా సినిమాల్లో నటించేలా కెరీర్ ను ప్లాన్ చేసుకుంటున్నారు.