ట్రైలర్ టాక్ : మెంటల్ మాస్ అండ్ వైల్డ్ గా “ఆనిమల్”..

ఇప్పుడు యావత్తు బాలీవుడ్ సినిమా సహా టాలీవుడ్ ఆడియెన్స్ కూడా ఎదురు చూస్తున్న ఓ మోస్ట్ అవైటెడ్ బాలీవుడ్ సినిమా ఏదన్నా ఉంది అంటే అది బాలీవుడ్ స్టార్ నటుడు రణబీర్ కపూర్ హీరోగా నటించిన క్రేజీ చిత్రం “ఆనిమల్” అనే చెప్పాలి. మరి ఈ చిత్రాన్ని తెలుగు దర్శకుడు సందీప్ రెడ్డి వంగ తెరకెక్కించగా ఒకో అప్డేట్ తో ఈ సినిమాపై ఇప్పుడు అంచనాలు పీక్స్ లోకి వెళుతున్నాయి.

అయితే ఇప్పుడు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ట్రైలర్ కట్ ని ఐతే మేకర్స్ రిలీజ్ చేశారు. అయితే సింపుల్ గా చెప్పాలంటే అసలు సినిమా కథ అంతటినీ ట్రైలర్ లోనే దర్శకుడు చూపించేసాడు. హీరో చిన్న నాటి నుంచి క్లైమాక్స్ ఏంటి అనేది కూడా ట్రైలర్ లోనే రివీల్ చేసేసాడు.

అయినా కూడా ఆ ట్రైలర్ సంథింగ్ స్పెషల్ గానే ఉందని చెప్పడంలో సందేహమే లేదు. ఎందుకంటే మెయిన్ గా ఆ డైలాగ్స్ హార్డ్ హిట్టింగ్ ఎమోషన్స్ ట్రైలర్ ని మెంటల్ మాస్ లెవెల్లో నిలబెట్టాయి. ఇక వైలెన్స్ అయితే ఇంకో లెవెల్లో కనిపిస్తుంది. తండ్రీ కొడుకుల మధ్య ప్రేమ దాని కోసం హీరో పడే తపన చాలా ఇంటెన్స్ గా దర్శకుడు చూపించాడు.

చాలా గ్రిప్పింగ్ గా ట్రైలర్ అయితే ఉంది కానీ మూడు గంటల 21 నిముషాలు కూడా సినిమా ఇలానే ఉంటే బాలీవుడ్ లో ఇది కూడా మరో హిస్టరీ క్రియేట్ చేస్తుంది అని చెప్పవచ్చు. మరి ఈ డిసెంబర్ 1 కోసం ఇపుడు చాలా మందే ఎదురు చూస్తున్నారు. కాగా పాన్ ఇండియా లెవెల్లో ఈ సినిమా రిలీజ్ కాబోతుంది.