పవన్ ఫ్యాన్స్ కి ఒక బ్యాడ్ న్యూస్ ఒక గుడ్ న్యూస్..!

టాలీవుడ్ గాడ్ ఆఫ్ మాసెస్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇప్పుడు సినిమాలు పక్కన పెట్టి ఫుల్ ఫోకస్ మళ్ళీ రాజకీయాలపై పెట్టిన సంగతి తెలిసిందే. దీనితో ఎక్కడ సినిమాలు అక్కడే ఆగిపోయాయి. ఏపీలో అయినా సెట్స్ వేసుకొని సినిమాలు చేస్తామని నిర్మాతలు ప్లాన్ చేసినప్పటికీ పవన్ మాత్రం ఏమాత్రం ఎవరికీ అందుబాటులో ఉండడం లేదు.

దీనితో ఫ్యాన్స్ లో కూడా అంతా కన్ఫ్యూజన్ నెలకొంది. కాగా ఇప్పుడు ఇదే ఫ్యాన్స్ కి ఓ గుడ్ న్యూస్ ఓ బ్యాడ్ న్యూస్ అయితే పవన్ విషయంలో బయటకి వచ్చాయి. మొదట బ్యాడ్ న్యూస్ విషయానికి వస్తే.. ఈ డిసెంబర్ 31 లేదా జనవరి 1కి పవన్ నటిస్తున్న సెన్సేషనల్ చిత్రం “ఓజి” నుంచి ఓ అప్డేట్ వస్తుంది అని ఓ ప్రచారం జరుగుతుంది.

కానీ ఇందులో ఎలాంటి నిజం లేదని ఇప్పుడు తెలుస్తుంది. ఇక ఇక గుడ్ న్యూస్ ఏమిటంటే రీసెంట్ గా టాలీవుడ్ టాప్ నిర్మాతలు మాట్లాడుతున్న ఓ ఇంటర్వ్యూలో పవన్ నుంచి వచ్చే ఏడాదిలో ఉస్తాద్ భగత్ సింగ్ అలానే ఓజి రెండు సినిమాలు కూడా థియేటర్స్ లో విడుదల అవుతాయని కన్ఫర్మ్ చేశారు. దీనితో కనీసం వీటి రిలీజ్ పై అయినా ఓ క్లారిటీ వచ్చినందుకు పవన్ ఫ్యాన్స్ కాస్త ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి అయితే పవన్ సినిమాల పరిస్థితి ప్రస్తుతానికి ఇలా ఉంది.