Naga Babu: ఒక్కడి కోసం కొన్ని లక్షల గుండెచప్పుళ్ళు.. నాగబాబు ట్వీట్!

Naga Babu: టాలీవుడ్ నటుడు, మెగా సోదరుడు నాగబాబు నిన్న తన సోదరుడి పవన్ కళ్యాణ్ జనసేన వార్షికోత్సవం సందర్భంగా ఆ వేడుకలో పాల్గొన్న సంగతి తెలిసిందే. పైగా ఆయన ఆ వేదికపై పవన్ కళ్యాణ్ గురించి ఎన్నో విషయాలు పంచుకున్నాడు. ఇక ఆ వేడుకకు కొన్ని లక్షల మంది అభిమానులు తరలి రాగా.. అందులో పవన్ మాట్లాడిన మాటలు ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారుతున్నాయి.

ఇదిలా ఉంటే తాజాగా నాగబాబు తన ట్విట్టర్ వేదికగా పవన్ సభ పై ట్వీట్ చేశాడు. మీరు చూపించిన ప్రేమ, మద్దతు అందరికీ కృతజ్ఞతలని.. మీ ప్రేమాభిమానాలే అవినీతి రహిత పాలన ఏర్పాటులో భాగంగా మెరుగైన, ధైర్యవంతమైన రేపటి సమాజం కోసం మీ ముందుకు నడిచేలా చేస్తున్నాయి. ఒక్కడి కోసం.. ఒక స్ట్రోక్ లోనే కొన్ని లక్షల గుండెచప్పుళ్ళు వినిపించడం చూస్తుంటే చాలా గొప్ప అనుభూతినిస్తోందని అన్నాడు.