లేటెస్ట్ : రజినీకాంత్ నుంచి దీపావళికి డబుల్ బ్లాస్ట్ రెడీ..!

సౌత్ ఇండియా సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా నటించిన రీసెంట్ చిత్రం “జైలర్” కోసం తెలుగు ఆడియెన్స్ కి కూడా ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. సూపర్ స్టార్ రజినీకాంత్ ఒక సరైన హిట్ కొడితే చూడాలి అని చాలా మంది అనుకుంటున్నా సమయంలో దర్శకుడు నెల్సన్ దిలీప్ అందించిన ఈ చిత్రం ఒక పర్ఫెక్ట్ కం బ్యాక్ లా అనిపించగా తమిళ నాట బిగ్గెస్ట్ హిట్స్ లో ఒకటిగా అయితే ఇది నిలిచింది.

ఏకంగా 600 కోట్లకి పైగా గ్రాస్ ని ఈ సినిమా వరల్డ్ వైడ్ అందుకుంటే ఈ సినిమాకి 100 కోట్లు తెలుగు రాష్ట్రాలు నుంచే వచ్చాయి. దీనితో అప్పటి వరకు అంచనాలు లేని తన మరో చిత్రం “లాల్ సలామ్” పై మంచి బజ్ వచ్చేసింది. అయితే ఇందులో రజనీకాంత్ హీరో కాదు కానీ తాను గెస్ట్ పాత్రలో నటిస్తున్నారు.

కాగా యంగ్ హీరోలు విష్ణు విశాల్ మరియు విక్రాంత్ లు హీరోస్ గా నటిస్తుండగా రజినీకాంత్ ఒక ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. కానీ ఇప్పటివరకు ఈ సినిమాని రజినీకాంత్ సినిమా లానే ప్రమోట్ చేస్తున్నారు. దీనితో మంచి అంచనాలు ఈ సినిమా సెట్ చేసుకోగా మేకర్స్ ఇప్పుడు టీజర్ రిలీజ్ కి టైం లాక్ చేశారు.

ఈ టీజర్ అయితే ఈ నవంబర్ 12న 10గంటల 45 నిమిషాలకి దీపావళి కానుకగా విడుదల చేస్తున్నట్టుగా తెలిపారు. ఇక దీనితో పాటుగా దీపావళి కానుకగానే జైలర్ చిత్రం తెలుగు ఆడియెన్స్ సహా తమిళ ఆడియెన్స్ కి కూడా టెలికాస్ట్ కి రావడానికి సిద్ధం అయ్యింది. దీనితో ఆరోజు మాత్రం రజినీకాంత్ ఫ్యాన్స్ కి డబుల్ బ్లాస్ట్ ఫీస్ట్ అని చెప్పాలి. ఇక లాల్ సలామ్ కి ఏ ఆర్ రహమాన్ సంగీతం అందిస్తుండగా రజినీకాంత్ కూతురు ఐశ్వర్య రజినీకాంత్ దర్శకత్వం వహిస్తుంది. 
https://x.com/arrahman/status/1722955750669189329?s=20