సామ్ “శాకుంతలం”పై బిగ్ అప్డేట్ ఇచ్చిన చిత్ర యూనిట్.!

నటి సమంతా ఇప్పుడు చేస్తున్న పలు చిత్రాలు వెబ్ సిరీస్ లలో మన తెలుగు నుంచి కూడా తెరకెక్కుతున్న భారీ సబ్జెక్టు లు యశోద, శాకుంతలం చిత్రాలు కూడా ఒకటి. మరి యశోద అయితే ఈ నెల లోనే రిలీజ్ కాబోతుండగా నెక్స్ట్ మరో భారీ పాన్ ఇండియా సినిమా “శాకుంతలం” రిలీజ్ కి రెడీ కానుంది.

అయితే ఈ సినిమా రిలీజ్ పై ఇది వరకే చిత్ర యూనిట్ ఆల్రెడీ ఓసారి అప్డేట్ ఇచ్చి మళ్ళీ సినిమా వాయిదా వేశారు. అయితే ఇప్పుడు తాజాగా చిత్ర యూనిట్ మరో బిగ్ అప్డేట్ ని అయితే రివీల్ చేశారు. ఈ చిత్రాన్ని 3D లో కూడా రిలీజ్ చేస్తున్నామని తెలిపారు.

అలాగే దీనిపై రిలీజ్ చేసిన వీడియో కూడా మంచి ఆసక్తిని రేపుతోంది. మరి ఈ వీడియో తోనే సినిమా కొత్త రిలీజ్ డేట్ కూడా హింట్ ఇస్తూ దీనిని అతి త్వరలోనే అనౌన్స్ చేయబోతున్నట్టుగా కన్ఫర్మ్ చేశారు. మరి దీనితో అయితే సినిమాపై మరిన్ని అంచనాలు పెరిగాయని చెప్పాలి.

ఇక ఈ చిత్రానికి అయితే మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. అలాగే సామ్ సరసన దేవ్ మోహన్ నటిస్తున్నాడు. అలాగే శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ మరియు గుణ ఆర్ట్స్ వారు సంయుక్తంగా భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మాణం వహించారు.