ఆ హీరోకి పెద్ద అభిమానిని : నిఖిల్

టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా ఎంట్రీ ఇచ్చి హీరోగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు నిఖిల్ సిద్ధార్థ్. హ్యాపీ డే సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన నిఖిల్ అనంతరం వరుస సినిమా అవకాశాలను అందుకొని ఇండస్ట్రీలో హీరోగా కొనసాగుతున్నారు. తాజాగా ఈయన దర్శకుడు చందు మొండేటి దర్శకత్వంలో తెరకెక్కిన కార్తికేయ2 చిత్రం ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా అద్భుతమైన విజయాన్ని అందుకుంది.

ఇక ఈ సినిమా కేవలం సౌత్ ఇండస్ట్రీలోనే కాకుండా నార్త్ ఇండస్ట్రీలో కూడా భారీ కలెక్షన్లను రాబట్టి ఏకంగా 130 కోట్ల పైగా కలెక్షన్లను రాబట్టింది. ఇదిలా ఉండగా తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి నిఖిల్ తన అభిమాన హీరో గురించి ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. తనకు బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్ అంటే ఎంతో ఇష్టమని తానే తన అభిమాన హీరో అంటూ తెలియజేశారు.ఇక షారుక్ ఖాన్ సినిమాలు ప్రతి ఒక్కటి తప్పకుండా చూస్తానని ఆయన ఇంటర్వ్యూలు టెలివిజన్లో వస్తే ఏ ఇంటర్వ్యూ కూడా మిస్ కాకుండా చూస్తానని తెలిపారు.

సాధారణ హీరో నుంచి బాలీవుడ్ కింగ్ కాంగ్ వరకు ఆయన ఎదిగిన తీరు తనని ఎంతో ఇన్స్పైర్ చేసిందని, షారుక్ ఖాన్ తనకు స్ఫూర్తి అంటూ ఈ సందర్భంగా నిఖిల్ బాలీవుడ్ నటుడు షారుక్ ఖాన్ గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఈయన చేసినటువంటి ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇకపోతే కార్తికేయ 2 థియేట్రికల్ రన్ పూర్తి కాగా నేటి (అక్టోబర్ 5) నుంచి జీ 5 ఓటీటీలో ప్రసారమవుతుంది.