పాటలకు 90 కోట్ల ఖర్చు.. థమన్ ఏం చేస్తాడో?

రామ్ చరణ్ శంకర్ కాంబినేషన్లో రాబోతున్న గేమ్ చెంజర్ సినిమాపై ఇప్పటివరకు అనుకున్నంత స్థాయిలో అయితే అంచనాలు పెరగలేదు. సినిమాకు సంబంధించిన అప్డేట్స్ విషయంలో అయితే చిత్ర యూనిట్ ఎలాంటి క్లారిటీ ఇవ్వకపోవడంతో ఈ సినిమాపై ఏ భాషలో కూడా పాజిటివ్ హైప్ అయితే రావడం లేదు. దాదాపు 300 కోట్లకు పైగా భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న సినిమా కాబట్టి తప్పకుండా ఎంతో కొంత హైప్ క్రియేట్ చేయాలి.

కానీ దిల్ రాజు టీం ఎందుకు ఈ విషయాన్ని అంతగా సీరియస్ గా తీసుకోవడం లేదు అని ఫ్యాన్స్ సోషల్ మీడియా ద్వారా ప్రశ్నిస్తున్నారు. అయితే ఈ సినిమాలో ఒక్కో పాటకు ఒక ప్రత్యేకత ఉండబోతుందట. మొత్తం ఐదు పాటలను సినిమాలో చూపించబోతున్నారు. ఇక వాటికోసం ఒక్కోపాటకు ఒక్కో ప్రముఖ కొరియోగ్రాఫర్ ను సెట్ చేశారు. దర్శకుడు శంకర్ సాంగ్స్ విషయంలో ఈ లెవెల్లో ఆలోచిస్తాడో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

ఇక కొరియోగ్రాఫర్స్ గా టాప్ టాలెంట్స్ గణేష్ ఆచార్య, ప్రభుదేవా, జానీ మాస్టర్, ప్రేమ్ రక్షిత్ మాస్టర్లు కూడా ఉన్నారు. ఇక ఇది ఒక లెక్క అయితే తమన్ ఎలాంటి మ్యూజిక్ ఇచ్చాడు అనే డౌట్స్ కూడా ఆడియన్స్ లో మొదలయ్యాయి. ఇప్పటికే కంపోజింగ్ ఫినిష్ అయినట్లు తెలుస్తోంది. కానీ తమన్ ఇటీవల కాలంలో ఏ సినిమా మ్యూజిక్ విషయంలో కూడా అనుకున్నంత స్థాయిలో ఆకట్టుకోవడం లేదు.

గుంటూరు కారం సినిమా మ్యూజిక్ విషయంలో కూడా అతను ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. మరి గేమ్ ఛేంజర్ సినిమాకు ఏ విధంగా మ్యూజిక్ ఇచ్చి ఉంటాడో అని ఫ్యాన్స్ లో అయితే సందేహాలు పెరుగుతున్నాయి. మరి ఫ్యాన్స్ అంచనాలను అందుకునే విధంగా మ్యూజిక్ ఇస్తాడో లేదో చూడాలి.