శ్రీలీల చేతిలో 7 ఆఫర్లు.. జాక్ పాట్!

పెళ్లి సందడి సినిమాతో టాలీవుడ్ లోకి హీరోయిన్ గా అడుగుపెట్టిన అందాల భామ శ్రీలీల. ఈ అమ్మడు మొదటి సినిమా ఫ్లాప్ అయిన రెండో సినిమాని ఏకంగా మాస్ మహారాజ్ రవితేజకి జోడీగా ధమాకా సినిమాలో నటించింది. ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. అలాగే ఈ అమ్మడు కూడా రవితేజ ఎనర్జీని అందుకొని పెర్ఫార్మెన్స్ లో కుమ్మేసింది. ఈ సినిమా తర్వాత శ్రీలీల క్రేజ్ అమాంతం పెరిగిపోయింది అని చెప్పాలి. ప్రస్తుతం ఈ అమ్మడు త్రివిక్రమ్ శ్రీనివాస్, సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాలో సెకండ్ లీడ్ లో శ్రీలీల నటిస్తుంది.

అలాగే ఉస్తాద్ భగత్ సింగ్ మూవీలో కూడా శ్రీలీలని సెకండ్ హీరోయిన్ గా ఖరారు అయ్యిందనే మాట వినిపిస్తుంది. బ్యాక్ టూ బ్యాక్ సూపర్ స్టార్, పవర్ స్టార్ తో జతకట్టే అవకాశం రావడం నిజంగా గొప్ప విషయం అని చెప్పాలి. వీటితో పాటు శ్రీలీల చేతిలో ఏకంగా అరడజను వరకు సినిమాలు ఉన్నాయి. బోయపాటి, రామ్ పోతినేని కాంబినేషన్ లో తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీలో శ్రీలీల హీరోయిన్ గా నటిస్తుంది.

అలాగే నితిన్, వక్కంతం వంశీ కాంబోలో వస్తున్న సినిమాలో కూడా శ్రీలీల హీరోయిన్ గాఉంది. పంజా వైష్ణవ్ తేజ్ నాలుగో సినిమాలో కూడా ఆమెనే హీరోయిన్, అలాగే అనగననగా ఒక రాజు అనే సినిమాలో శ్రీలీలనే హీరోయిన్. దీంతో పాటు బాలయ్య, అనిల్ రావిపూడి కాంబినేషన్ తెరకెక్కుతున్న సినిమాలో శ్రీలల కీలక పాత్రలో నటిస్తుంది. ఇలా వరుస ప్రాజెక్ట్స్ తో ఈ అమ్మడు టాలీవుడ్ లో ప్రస్తుతం క్రేజియస్ట్ హీరోయిన్ గా కొనసాగుతుంది.

కేవలం ఒక హిట్, ఒక ఫ్లాప్ తో టాలీవుడ్ లో ఈ రేంజ్ లో స్టార్ హీరోల చిత్రాలలో వరుస అవకాశాలు సొంతం చేసుకుంటున్న అందాల భామ శ్రీలీల అరుదైన గుర్తింపు సొంతం చేసుకుంటుంది అని చెప్పాలి. ఈ సినిమాలు గాని హిట్ అయితే ఇక టాలీవుడ్ లో ఈ జెనరేషన్ కి స్టార్ హీరోయిన్ గా శ్రీలీల మారిపోవడం పక్కా అనే మాట వినిపిస్తుంది.