చందూ చేతికి చిక్కిన 60 కోట్ల ప్రాజెక్ట్

అక్కినేని యువహీరో నాగ చైతన్య తాజాగా కస్టడీ మూవీతో ప్రేక్షకుల ముందుకి వచ్చి డిజాస్టర్ ని ఖాతాలో వేసుకున్నారు. మొదటి సారి పోలీస్ రోల్ లో కనిపించిన చైతూని చిత్రం నిరాశ పరిచింది. దీంతో వరుసగా హ్యాట్రిక్ పరాజయాలు అతని ఖాతాలో పడ్డట్లు అయ్యింది. ఇదిలా ఉంటే నెక్స్ట్ ప్రాజెక్ట్ ని నాగ చైతన్య గీతా ఆర్ట్స్ లో చేయడానికి కమిట్ అయ్యాడు.

ఈ మూవీకి సంబంధించి ఫైనల్ స్క్రిప్ట్ వర్క్ ప్రస్తుతం జరుగుతోంది. చందూ మొండేటి దర్శకత్వంలో ఈ మూవీ తెరకెక్కనుంది. ఈ సినిమాని ఏకంగా 60 కోట్ల బడ్జెట్ తో అల్లు అరవింద్ నిర్మించడానికి రెడీ అవుతున్నారంట. ఈ మధ్యకాలంలో గీతా ఆర్ట్స్ నుంచి బయట హీరోతో భారీ బడ్జెట్ తో చేయబోతోన్న మూవీ ఇదే కావడం విశేషం.

నాగ చైతన్య మార్కెట్ వేల్యూ చూసుకున్న ప్రస్తుతం 25 కోట్లకి మించి లేదు. కస్టడీ మూవీ అతని కెరియర్ లో ఇప్పటి వరకు హైయెస్ట్ బిజినెస్ చేసిన చిత్రం. అయితే చైతూ మార్కెట్ రేంజ్ కి మించి ఇప్పుడు ఈ మూవీ కోసం గీతా ఆర్ట్స్ బడ్జెట్ పెట్టడానికి రెడీ కావడం అందరికి షాక్ ఇస్తోంది. అయితే ముందుగా కథ, హీరోని అల్లు అరవింద్ ఫైనల్ చేసారంట.

కథ ఫైనల్ అయిన చైతన్య ఇంకా కొన్ని మార్పులు సూచించినట్లు తెలుస్తోంది. చందూ మొండేటి దర్శకత్వంలో సూర్య హీరోగా 300 కోట్ల బడ్జెట్ తో ఒక చిత్రాన్ని గీతా ఆర్ట్స్ ఫైనల్ చేశారు. సూర్య కూడా కథ విని ఒకే చెప్పారు. అయితే అతని కాల్ షీట్స్ ఇప్పట్లో ఖాళీ లేవు. మరో ఏడాది వెయిట్ చేయాల్సిందే. ఈ నేపథ్యంలో నాగచైతన్యతో మూవీని చందూ మొండేటి దర్శకత్వంలో పూర్తి చేయాలని అల్లు అరవింద్ డిసైడ్ అయ్యారంట.

ఇక ఈ ప్రాజెక్ట్ బాద్యతలని అతనికి అప్పగించడం కూడా జరిగిందని తెలుస్తోంది. పెద్ద బడ్జెట్ మూవీ కావడం ఇప్పటికే కార్తికేయ 2తో పాన్ ఇండియా హిట్ కొట్టి ఉండటంతో చందూ అయితే పెర్ఫెక్ట్ అని అతనికి చైతన్య సినిమాని అప్పగించారంట. ఇక చైతూ సూచించిన మార్పులు చేసే పనిలో చందూ ఇప్పుడు స్క్రిప్ట్ పైన కూర్చున్నారంట. త్వరలో స్క్రిప్ట్ ఫైనల్ అయితే అఫీషియల్ ఎనౌన్స్ మెంట్ ఇచ్చి సెట్స్ పైకి వెళ్లాలని భావిస్తున్నారు.