యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఫ్యూచరిస్టిక్ కాన్సెప్ట్ తో తెరకెక్కుతోన్న సినిమా ప్రాజెక్ట్ కె. ఈ మూవీ షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఈ సినిమా మెజారిటీ పార్ట్ గ్రాఫిక్స్ తోనే ఉండబోతోంది. నాగ్ అశ్విన్ అయితే ఈ చిత్రం కోసం సరికొత్త ప్రపంచాన్ని రీక్రియేట్ చేస్తున్నాడు. అందుకే షూటింగ్ మొత్తం స్టూడియోలలో భారీ సెట్స్ వేసి చేస్తున్నారు.
మెజారిటీ షూటింగ్ అంతా రామోజీ ఫిల్మ్ సిటీలోనే జరుగుతోంది. చిత్రంలో అమితాబచ్చన్, దీపికా పదుకునే, దిశాపటాని లాంటి స్టార్ క్యాస్టింగ్ నటిన్నారు. ఇక మీ సినిమాలోని విలన్ పాత్ర కోసం కమల్ హాసన్ ని సంప్రదిస్తున్నారనే ప్రచారం నడుస్తోంది. భారీగా రెమ్యునరేషన్ ఇచ్చి మరీ ఈ మూవీలో తీసుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారంట.
ఇక వైజయంతీ మూవీస్ బ్యానర్ పై అశ్వినీదత్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారని అందరూ అనుకుంటున్నారు. అఫీషియల్ గా ఇప్పటి వరకు బయటకి వచ్చింది కూడా అదే. సుమారు 500 నుంచి 600 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతోన్న సినిమా కావడంతో అశ్వనీదత్ పెద్ద రిస్క్ చేస్తున్నాడని అందరూ భావిస్తున్నారు. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ మూవీ నిర్మాణంలో ఏకంగా 6 మంది భాగస్వాములుగా ఉన్నారంట.
ఏషియన్ ఫిలిమ్స్ సునీల్ నారంగ్ తో పాటు మరికొంత మంది ప్రాజెక్ట్ కె నిర్మాణ భాగస్వాములుగా ఉన్నారనే విషయం తెలుస్తోంది. ముఖ్యంగా డిస్టిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్ ఈ సినిమా నిర్మాణంలో పెట్టుబడులు పెట్టినట్లు సమాచారం. అయితే అఫీషియల్ గా వైజయంతీ బ్యానర్ అయిన కూడా నిర్మాణ భాగస్వాములుగా వారి పేర్లు ఉంటాయని టాక్.
హాలీవుడ్ సినిమాలు ఎక్కువగా మల్టీపుల్ ప్రొడక్షన్ హౌస్ లు కలిసి నిర్మిస్తూ ఉంటాయి. అలా నిర్మించడం వలన బడ్జెట్ షేరింగ్ జరిగి ఒకరి మీదనే భారం మొత్తం పడకుండా ఉంటుంది. ఎప్పటి నుంచో ఈ ఫార్మాట్ ని వారు ఫాలో అవుతున్నారు. తెలుగులో కూడా ఈ మధ్యనే ఈ ట్రెండ్ మొదలైంది. అయితే చిన్న సినిమాల కూడా రెండు, మూడు ప్రొడక్షన్ హౌస్ లు కలిసి పనిచేస్తున్నాయి. అయితే మొదటిసారి ఓ పాన్ వరల్డ్ ప్రాజెక్ట్ కోసం ఆరుగురు ప్రొడ్యూసర్ లు కలిసి పెట్టుబడులు పెట్టడం విశేషం.