2024 సంక్రాంతి.. బడా హీరోల క్లాష్?

సంక్రాంతి అనేది పెద్ద సినిమాలకు ఎప్పుడూ కూడా మంచి బూస్ట్ ఇస్తుంది అని చెప్పాలి. ఇటీవల విడుదలైన రెండు కమర్షియల్ సినిమాలు ఏలాంటి కలెక్షన్స్ అందుకున్నాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. వాల్తేరు వీరయ్య కాస్త పాజిటివ్ అందుకొని సాలిడ్ లాభాలు అందుకోగా నందమూరి బాలకృష్ణ వీర సింహారెడ్డి మాత్రం నెగిటివ్ టాక్ అందుకున్నప్పటికీ ప్రాఫిట్ జోన్ లోకి వచ్చేసింది.

అయితే 2024ని టార్గెట్ చేస్తూ కొన్ని పెద్ద సినిమాలు విడుదల డేట్ ను ఫిక్స్ చేసుకోవాలని అనుకుంటున్నాయి. అయితే అన్నీ కూడా పెద్ద సినిమాలు కావడం విశేషం. ముఖ్యంగా అల్లు అర్జున్ పుష్ప 2 సినిమా అయితే ఈసారి ఎట్టి పరిస్థితుల్లో 2024 సంక్రాంతికి రావాలి అని టార్గెట్ అయితే పెట్టుకున్నాడు. అలాగే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హరిష్ శంకర్ కాంబినేషన్లో రాబోతున్న ఉస్తాద్ భగత్ సింగ్ కూడా సంక్రాంతి ని టార్గెట్ చేసినట్లు సమాచారం.

ఇక మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ శంకర్ కలయికలో రాబోతున్న RC 15 ప్రాజెక్ట్ కూడా అటు తిరిగి ఇటు తిరిగి మళ్ళీ వచ్చే సంక్రాంతిని టార్గెట్ చేసింది. ఇక వీటితో పాటు నందమూరి బాలకృష్ణ తన 108వ ప్రాజెక్టును మళ్ళీ వచ్చే సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని అనుకుంటున్నాడు. ఈ సినిమాకు అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే.

అయితే ఈ నాలుగు సినిమాలతోపాటు నాగార్జున ప్రముఖ రైటర్ ప్రసన్నకుమార్ బెజవాడతో చేస్తున్న ప్రాజెక్టు కూడా వచ్చే సంక్రాంతికి రానున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఇక ఈ క్లాష్ లో అయితే తప్పకుండా రెండు సినిమాలు డ్రాప్ అవ్వడం పక్క అని చెప్పవచ్చు. ఇక వీటి కంటే ముందు డిసెంబర్లో వెంకటేష్ సైంధవ సినిమా ఈ ఏడాది డిసెంబర్లో ప్రేక్షకుల ముందుకు రానుంది.