2024 మెగా నామ సంవత్సరం.. మెగా హీరోల జోష్ మామూలుగా లేదుగా!

మెగా ఫ్యామిలీకి 2024 ఏడాది మరింత గుర్తింపు దక్కేలా చేసింది. మెగాభిమానులు ఆనందం రెట్టింపయ్యేలా చేసింది. 2024లో మెగా ఫ్యామిలీకి వచ్చిన ఆనందాలు ఏమిటి, ఎందుకు వాళ్ళందరూ సంబరాలు చేసుకుంటున్నారు ఇప్పుడు చూద్దాం.సినిమాల్లో పవర్ స్టార్ అయిన పవన్ కల్యాణ్ ఏపీ రాజకీయల్లోనూ పవర్ చూపారు. 2024 ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టడంలో కీలకపాత్ర పోషించారు. 21అసెంబ్లీ, 2పార్లమెంట్.. పోటీ చేసిన అన్నిచోట్లా విజయం సాధించి 100శాతం స్ట్రైక్ రేట్ సాధించిన పార్టీగా జనసేనను నిలిపారు.

డిప్యూటీ సీఎంగా, మంత్రిగా ప్రమాణస్వీకారం చేసి అభిమానుల్లో నూతనోత్సాహాన్ని తీసుకొచ్చారు.గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కూడా అభిమానులకు కిక్ ఇచ్చారు. చెన్నైలోని వేల్స్ యూనివర్శిటీ నుంచి గౌరవ డాక్టరేట్ పొందారు. గేమ్ చేంజర్ టీజర్ తో అభిమానులకు నూతనోత్సాహాన్ని ఇచ్చారు. మెగాస్టార్ చిరంజీవికి దేశపు రెండో అత్యున్నత కేంద్ర ప్రభుత్వ పురస్కారం ‘పద్మవిభూషణ్’ గౌరవం దక్కింది. ప్రతిష్టాత్మక గిన్నీస్ రికార్డు వరించింది.

155 సినిమాల్లో 537 పాటల్లో 24,000 డ్యాన్స్ మూమెంట్స్ చేసిన భారతదేశపు ఒకేఒక్క హీరోగా తిరుగులేని రికార్డు, గుర్తింపు పొందారు. ఈ విషయంలో మెగా అభిమానుల ఆనందానికి అవధులు లేవుఇక నాగబాబు జనసేన విజయంలో కీలక భాగం అయ్యారు. సంవత్సరం చివర్లో నాగబాబుకి ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి పదవి ఇస్తాను అని సీఎం చంద్రబాబు ప్రకటించడంతో మెగా ఫ్యామిలీ, ఫ్యాన్స్, జనసైనికులు మరింత సంతోషం వ్యక్తపరిచారు.

మెగా డాటర్ నిహారిక నటిగా, నిర్మాతగా సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే.ఈ సంవత్సరం కమిటీ కుర్రోళ్ళు అనే సినిమాని కొత్త నటీనటులతో నిర్మించి పెద్ద హిట్ సాధించింది. ఈ సినిమా ఆల్మోస్ట్ 30 కోట్లు కలెక్ట్ చేసి ఆల్మోస్ట్ నెలరోజుల పాటు థియేటర్లో ఆడింది. దీంతో నిహారికకు పేరు, డబ్బులు బాగానే వచ్చి మరింత వైరల్ అయింది.దీంతో అభిమానులు ఇది మెగానామ సంవత్సరం అంటూ సంబరాలు చేసుకుంటున్నారు.