1000 కోట్ల ప్రాజెక్ట్.. సాయి పల్లవి రిస్క్?

సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి సాయి పల్లవి త్వరలో బహుభాషా చిత్రం రామాయణంలో సీత పాత్రను పోషించడానికి చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అల్లు అరవింద్ మరికొందరు బాలీవుడ్ నిర్మాతలతో కలిసి 1000 కోట్ల రూపాయల భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఇక భారతదేశంలోని వివిధ భాషలకు చెందిన అగ్ర నటులు నటించనున్నారు.

అయితే, సాయి పల్లవి ఈ ప్రాజెక్ట్‌కి ప్రత్యేకంగా రెండేళ్లపాటు కమిట్ అవ్వాల్సి ఉంటుందని, ఇది ఆమె కెరీర్‌కు రిస్క్‌ అయ్యే అవకాశం ఉన్నట్లు టాక్ వస్తోంది. ఎందుకంటే, నటీమణులు హీరోయిన్స్ గా కొనసాగేది చాలా తక్కువ కాలమే. ఇక 30 ఏళ్లు నిండిన తర్వాత మరింత కష్టమవుతుంది. ఇక సాయి పల్లవి రామాయణం కోసం రెండేళ్లు కేటాయించడానికి అంగీకరించిందని వార్తలు వచ్చినప్పటికీ, చివరికి ఆమె రిస్క్ తీసుకుంటుందా లేదా అనేది ఇంకా స్పష్టంగా తెలియలేదు.

మరోవైపు శ్రీ లీల, కృతి శెట్టి ఇప్పటికే టాలీవుడ్‌లో తమకంటూ ఒక క్రేజ్ అందుకున్నారు, ఈ సమయంలో సాయి పల్లవి ఇతర ప్రాజెక్ట్‌లలో వర్క్ తో బిజీ అయితే మంచి అవకాశాలు కోల్పోయే ప్రమాదం ఉంది. సాయి పల్లవి చివరి తెలుగు సినిమా శ్యామ్ సింగ్ రాయ్. ఆ తరువాత ఆమెకు పెద్దగా ఛాన్సులు రావడం లేదు.

అంతిమంగా, ఒకే ప్రాజెక్ట్‌కి రెండేళ్లు కట్టుబడి నిర్ణయం తీసుకుంటే ఏ నటికైనా రిస్క్ అని చెప్పవచ్చు. ఇక సాయి పల్లవి ఈ రిస్క్ తీసుకుంటుందో లేదో చూడాలి. ఒకవేళ ఆమె రిస్క్ చేస్తే, అది ఆమె కెరీర్‌కు గేమ్ ఛేంజర్ కావచ్చు. ఎందుకంటే రామాయణం భారతీయ సినిమా చరిత్రలో ఒక మైలురాయి చిత్రంగా ఉంటుందని భావిస్తున్నారు. మరి ఆమె లక్ ఎలా ఉంటుందో చూడాలి.