రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి సినిమాతో నేషనల్ స్టార్‌గా మారిన ప్రభాస్ సాహో అనే భారీ బడ్జెట్ చిత్రాన్ని తెరకెక్కించాడు. ఈ సినిమా హిందీలో మంచి విజయం సాధించినప్పటికీ తెలుగు ప్రేక్షకులని అలరించలేకపోయింది. సాహో చిత్రం డివైడ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ ప్రభాస్‌తో బడా చిత్రాలను నిర్మాంచేందుకు కసరత్తులు చేస్తున్నారు. ఇప్పటికే భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న రాధేశ్యామ్ చిత్రం 90 శాతం షూటింగ్ పూర్తి చేసుకోగా, నాగ్ అశ్విన్ పీరియాడికల్ మూవీ, ఓం రౌత్ తెరకెక్కిస్తున్న ఆదిపురుష్ చిత్రాలు త్వరలోనే సెట్స్‌పైకి వెళ్లనున్నాయి.
అయితే ఇప్పుడు ప్రభాస్ చేస్తున్న సినిమాల బడ్జెట్ దాదాపు రూ. 1000 కోట్లకి పైగానే ఉంటుందని సమాచారం. రజనీకాంత్, సల్మాన్ ఖాన్ కూడా ఇలాంటి ఫీట్ సాధించలేదని డార్లింగ్ ఫ్యాన్స్ అంటున్నారు. రాధేశ్యామ్ చిత్రం రూ.250 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కుతుండగా, ఈ చిత్రం 2021లో ప్రేక్షకుల ముందుకు రానుంది. యూరప్ బ్యాక్ గ్రౌండ్‌లో తెరకెక్కుతున్న ఈ పీరియడ్ రొమాంటిక్ డ్రామాలో పూజా హెగ్డే కథానాయికగా నటిస్తుంది. యూవీ క్రియేషన్స్ నిర్మిస్తుంది.
బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వంలో ప్రభాస్ ఆదిపురుష్ అనే ఎపిక్ డ్రామా చేయనున్నాడు. ఈ చిత్రం రూ.450 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కుతుండగా, అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఇండియా సినిమాగా చరిత్ర సృష్టిస్తుంది. జనవరిలో సెట్స్ పైకి వెళ్లనున్న ఈ చిత్రాన్ని టీ సిరీస్ నిర్మిస్తుంది. ఆగస్ట్ 11,2022లో మూవీని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు
ఇక మహానటి ఫేం నాగ్ అశ్విన్.. ప్రభాస్ ప్రధాన పాత్రలో సైంటిఫిక్ థ్రిల్లర్ చేస్తున్నాడు. రూ. 300 కోట్ల బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. దీపికా పదుకొణే, అమితాబ్ బచ్చన్ వంటి స్టార్స్ ఇందులో నటిస్తుండగా, ఈ చిత్ర షూటింగ్ వచ్చే ఏడాది ఏప్రిల్‌లో మొదలు కానుంది. మొత్తానికి ప్రభాస్ చేస్తున్న మూడు చిత్రాలకి నిర్మాతలు వంద కోట్ల బడ్జెట్ కేటాయిస్తుండగా, వాటిని తిరిగి తీసుకొస్తాడా అనే దానిపై అందరిలో ఆసక్తి నెలకొంది.