100 కోట్ల క్లబ్.. 3 సార్లు అందుకున్న ధనుష్

కోలీవుడ్ లో స్టార్ హీరోగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకున్న నటుడు ధనుష్. రజినీకాంత్ అల్లుడు అనే ఇమేజ్ తోనే కోలీవుడ్ లో అందరి దృష్టిని ఆకర్షించిన కూడా తరువాత నటుడిగా తనకంటూ ప్రత్యేకమైన బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్నాడు. కమర్షియల్ చిత్రాలతో పాటు కంటెంట్ బేస్డ్ కథలని కూడా చేస్తూ యునిక్ మార్క్ సొంతం చేసుకున్నాడు. ప్రస్తుతం కోలీవుడ్ లో మోస్ట్ సక్సెస్ ఫుల్ హీరోలలో ధనుష్ కూడా ఒకరని చెప్పాలి.

ఇటు హీరోగానే కాకుండా దర్శకుడిగా, సింగర్ గా, రచయితగా కూడా ధనుష్ తన టాలెంట్ చూపిస్తూ మల్టీ టాలెంటెడ్ అనిపించుకున్నాడు. అలాగే కేవలం తమిళ్ భాషకి మాత్రమే కాకుండా హిందీలోకి ఎంట్రీ ఇచ్చి అక్కడ రెండు బ్లాక్ బస్టర్ హిట్ ని తన ఖాతాలో వేసుకున్నాడు. అలాగే సౌత్ ఇండియా నుంచి హాలీవుడ్ లో నటించిన రెండో హీరోగా ధనుష్ రికార్డ్ సృష్టించాడు. అంతకు ముందు రజినీకాంత్ ఈ ఫీట్ అందుకున్నాడు.

ఇదిలా ఉంటే ఇప్పుడు ధనుష్ ఖాతాలో మరో రికార్డ్ కూడా వచ్చి చేరింది. వంద కోట్ల క్లబ్ హీరోగా ధనుష్ కోలీవుడ్ లో ఉన్నాడు. హిందీలో అతను నటించిన రంజానాతో మొదటిసారి వంద కోట్ల క్లబ్ లో చేరాడు. తరువాత తిరు సినిమాలో మరో బ్లాక్ బస్టర్ హిట్ ని ఖాతాలో వేసుకున్నాడు. దీని తర్వాత తాజాగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో సితారా ఎంటర్టైన్మెంట్స్ నిర్మించిన సార్ మూవీ కూడా వంద కోట్ల క్లబ్ లో చేరిపోయింది.

ద్విభాషా చిత్రంగా ప్రేక్షకుల ముందుకి వచ్చిన సార్ రెండు చోట్ల బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. సమకాలిక పరిస్థితులకి అద్దం పట్టే విధంగా విద్యావ్యవస్థలో లోపాలని ఎత్తి చూపిస్తూ ఈ మూవీని తెరకెక్కించారు. దీంతో యువతకి ఈ మూవీ భాగా కనెక్ట్ అయ్యింది. ఈ నేపధ్యంలో సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యి కలెక్షన్స్ సునామీ సృష్టించింది. ఇప్పటికి ఈ మూవీ డీసెంట్ కలెక్షన్స్ తో కొనసాగుతూ ఉండటం విశేషం. లాంగ్ రన్ లో ఈ మూవీ ఏ స్థాయిలో కలెక్షన్స్ రాబడుతుంది అనేది చూడాలి.