ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్ పుష్ప సినిమాతో ఒక్కసారిగా ఫేమస్ అయ్యారు.ఇలా ఈయన ఈ సినిమాతో నార్త్ ఇండియాలో కూడా విపరీతమైన అభిమానులను సంపాదించుకోవడంతో ఈయనకు పెద్ద ఎత్తున ప్రముఖ కంపెనీలు తమ ఉత్పత్తులకు బ్రాండ్ అంబాసిడర్ గా ఉండమని కంపెనీలు ఈయన చుట్టూ క్యూ కట్టాయి.ఈ క్రమంలోనే అల్లు అర్జున్ సైతం ఒక్కో యాడ్ కు సుమారు 7.5 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు సమాచారం.ఇలా యాడ్ ద్వారా భారీగా సంపాదిస్తున్న అల్లు అర్జున్ కు ఫ్యాన్సీ ఆఫర్ వచ్చినట్లు తెలుస్తోంది.
ఈ క్రమంలోనే ఓ ప్రముఖ కంపెనీ తమ బ్రాండ్ కు అంబాసిడర్ గా వ్యవహరించమని అల్లు అర్జున్ సంప్రదించారట.ఇక తమ ఉత్పత్తులకు బ్రాండ్ అంబాసిడర్ గా ఉంటే ఏకంగా 10 కోట్ల పారితోషకం ఇస్తామని ఆఫర్ చేసినప్పటికీ అల్లు అర్జున్ మాత్రం ఆ ఆఫర్ ఎంతో సున్నితంగా రిజెక్ట్ చేసినట్టు తెలుస్తోంది. ఇంతకీ అల్లు అర్జున్ ఎందుకు రిజెక్ట్ చేశారనే విషయానికి వస్తే…
అల్లు అర్జున్ 10 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ ఆఫర్ చేసిన కంపెనీలు గుట్కా అండ్ లిక్కర్ కంపెనీ కావడం విశేషం.ఈ విధంగా ప్రజలకు హాని కలగచేసి, వారి ఆరోగ్యాలను పాడు చేసే ఉత్పత్తులకు తాను బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించని అల్లు అర్జున్ ఈ ఆఫర్ సున్నితంగా రిజెక్ట్ చేసినట్టు తెలుస్తోంది. ఇక ఈ విషయం తెలిసిన బన్నీ అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈయన సినిమాల విషయానికొస్తే త్వరలోనే పుష్ప 2 సినిమా షూటింగ్ తో ఈయన బిజీ కానున్నారు.