సెన్సేషనల్ “ఆనిమల్”..15 రోజుల్లో వరల్డ్ వైడ్ వసూళ్లు 

ఈ ఏడాది ఇండియన్ బాక్సాఫీస్ ని షేక్ చేసిన పలు బిగ్గెస్ట్ హిట్ చిత్రాల్లో బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ హీరోగా నేషనల్ క్రష్ రష్మిక మందన్నా హీరోయిన్ గా టాలీవుడ్ సెన్సేషనల్ దర్శకుడు సందీప్ రెడ్డి వంగ కాంబినేషన్ లో తెరకెక్కించిన ఒక విధ్వంసకర బ్లాస్టింగ్ చిత్రం “ఆనిమల్” కూడా ఒకటి.

కాగా ఈ సినిమా విడుదల అయ్యిన మొదటి రోజు నుంచే నెవర్ బిఫోర్ ఓపెనింగ్స్ ని రణబీర్ కపూర్ కెరీర్ లో అందుకోగా ఇపుడు వరల్డ్ వైడ్ గా ఐతే సక్సెస్ ఫుల్ గా 15 రోజుల రన్ ని కంప్లీట్ చేసుకుంది. అయితే ఈ సినిమాలో ఉన్న పొటెన్షియల్ కి ఖచ్చితంగా చాలానే మైలు రాయిలను బాక్సాఫీస్ దగ్గర అందుకుంటుంది అని చాలా మంది అనుకున్నారు.

ఇపుడు అనుకున్నట్టుగానే ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర వండర్స్ సెట్ చేస్తుంది. ఓ పక్క యూఎస్ మార్కెట్ లో సహా ఇండియాలో కూడా ఆనిమల్ రికార్డు వసూళ్ళు అందుకుంది. దీనితో ఈ చిత్రం ఇపుడు ఏకంగా 800 కోట్ల క్లబ్ లో జాయిన్ అయ్యేందుకు సిద్ధం అయ్యింది.

కాగా మొత్తం 15 రోజుల్లో అయితే ఈ చిత్రం మొత్తం 797.6 కోట్ల గ్రాస్ ని అందుకుంది. దీనితో ఇక ఈ 16వ రోజు వసూళ్లతో ఐతే ఈ చిత్రం ఆ 800 కోట్ల మార్క్ ని దాటేస్తుంది అని చెప్పొచ్చు. మరి ఫైనల్ రన్ లో ఎక్కడ ఆగుతుంది అనేది ఇప్పుడు బాక్సాఫీస్ విశ్లేషకుల్లో ఆసక్తిగా మారిన ప్రశ్న.