టాలీవుడ్ ఇండస్ట్రీలో నాన్ బాహుబలి రికార్డులను అందుకొని సినిమాకు పని చేసిన ప్రతి ఒక్కరికి యూ టర్న్ ఇచ్చిన చిత్రం అల.. వైకుంఠపురములో. అయితే ఈ సినిమా విడుదలై ఏడాది అయిన సందర్భంగా చిత్ర యూనిట్ రీ యూనియన్ వేడుకతోనే అందరిని మరోసారి ఎట్రాక్ట్ చేసింది. ఇక వేడుకలో మాటల మాంత్రికుడి మాటలు కూడా వైరల్ అయ్యేలా ఉన్నాయని అనిపిస్తోంది.
ముఖ్యంగా హీరోయిన్ పూజా హెగ్డే గురించి మాట్లాడిన త్రివిక్రమ్ ఆమె బాయ్ ఫ్రెండ్ నా అసోసియేట్ డైరెక్టర్ అని చెప్పడం అందరిని ఒక్క నిమిషం ఆశ్చర్యానికి గురి చేసింది. సినిమా షూటింగ్ జరిగినన్ని రోజులు హీరోయిన్ పూజా హెగ్డేకు ఎక్కువసార్లు కథను వినిపించింది నా అసోసియేట్ డైరెక్టర్ ఆనంద్.. ఆమెకు ఉదయమే నిద్ర వచ్చేది. ఇంకా ఎన్నిసార్లు కథలు వినాలి అనేలా అతను ఆలోచింపజేశాడని మాటల మాంత్రికుడు సరదాగా కామెంట్ చేశాడు.
గురూజీ పంచ్ లు, ప్రాసల గురించి అందరికి తెలిసిందే. అందుకే పూజా, అసోసియేట్ డైరెక్టర్ మధ్య స్టోరీ డిస్కషన్ వాతావరణానికి బాయ్ ఫ్రెండ్ అని కామెడీగా ట్యాగ్ ఇచ్చేశారు. ఇక అల్లు అరవింద్ అయితే తెలుగు కుర్రాడినే పెళ్లి చేసుకో అంటూ హైదరాబాద్ లో కొత్త ఇల్లు కొంటున్న విషయాన్ని కూడా స్టేజ్ పైనే రివీల్ చేసేశారు. ఇక ఆమె తెలుగులో మరిన్ని సినిమాలు చేయాలని అవసరం అయితే మరోసారి కలిసి ఇదే కాంబినేషన్ లో సినిమా చేద్దామని కూడా బుట్టబొమ్మకు తెలిపారు.