కొణిదెల వారింట పెళ్లి సందడి నెలకొంది. డిసెంబర్ 9న రాజస్తాన్‌లోని ఉదయ్‌పూర్ ప్యాలెస్‌లో జరగనున్న పెళ్లి వేడుకకి సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇక కొద్ది రోజులుగా మెగా వారింట ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ ఘనంగా జరుగుతుండగా, ఇవి అభిమానులకు కనుల విందుగా మారాయి. రీసెంట్‌గా చిరంజీవి దంపతులు నిహారికని పెళ్లి కూతురిని చేసే కార్యక్రమానికి హాజరయ్యారు. ఆ సమయంలో తీసిన ఫొటోలు సోషల్ మీడియాని షేక్ చేస్తున్నాయి.
నిహారిక పెళ్లిని గ్రాండ్‌గా ప్లాన్ చేయగా, ఈ కార్యక్రమానికి చిరంజీవి దగ్గర నుండి పవన్ , అల్లు అర్జున్, రామ్ చరణ్, సాయిధరమ్ తేజ్ ఇలా మెగా హీరోలందరితో పాటు పలువురు స్టార్స్ కూడా హాజరు కానున్నట్టు తెలుస్తుంది. ఈ పెళ్లి వేడుక టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారనుందని సమాచారం. అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో చిరంజీవి తన తన తమ్ముడి కూతురు నిహారిక పెళ్లికి అదిరిపోయే గిఫ్ట్‌ని ఇవ్వబోతున్నట్టు జోరుగా ప్రచారం జరుగుతుంది. నిహారికకి చిరు అంటే చాలా ఇష్టం. డాడీ అని ప్రేమగా పిలుచుకుంటూ ఉంటుంది. చిరుకి కూడా నిహారిక అన్న ప్రాణం.
ఆ బాండింగ్‌తోనే మెగాస్టార్ చిరంజీవి నిహారికకు కోటిన్నర విలువ చేసే బంగారు ఆభరణాన్ని బహుమతిగా ఇవ్వనున్నాడనే టాక్ నడుస్తుంది. ఇక పెళ్లి కొడుక్కి కూడా సర్‌ప్రైజింగ్ గిఫ్ట్ ఒకటి ప్లాన్ చేశాడట చిరు. పెళ్లికి మరో రెండు రోజుల సమయం మాత్రమే ఉండగా, ఈ రోజు మెగా ఫ్యామిలీ అంతా ఉదయ్ పూర్ ప్యాలెస్‌కు వెళ్లనున్నట్టు తెలుస్తుంది. అక్కడ మెహందీ వేడుక, సంగీత్ వేడుక జరగనుండగా, ఆ కార్యక్రమంలో మెగా హీరోలు చేసే సందడి ఓ రేంజ్‌లో ఉంటుంది. ఇదిలా ఉంటే చిరంజీవి ఆదివారం నిహారికకి తన ఆశీర్వాదం అందించేందుకు రాగా, ఆ సమయంలో సెల్ఫీ కూడా దిగాడు. చిరు- నిహారిక సెల్ఫీని నాగబాబు తన సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. ఆయన ప్రేమకు ఎటువంటి సరిహద్దులు ఉండవు.. అతని చిరునవ్వు ప్రతి సంఘటనను ఒక వేడుకగా మారుస్తుందని కామెంట్ పెట్టాడు. ప్రస్తుతం ఇది వైరల్‌గా మారింది.