ద‌స‌రా స్పెష‌ల్: బిగ్ బాస్ స్టేజ్‌పై స‌మంత‌, అఖిల్, పాయ‌ల్, కార్తికేయ‌

అన్ని ప్రాంతీయ భాష‌ల‌లో స‌క్సెస్‌ఫుల్‌గా దూసుకెళుతున్న బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్. తెలుగులో నాలుగో సీజ‌న్ జ‌రుపుకుంటున్న ఈ షో నేడు బుల్లితెర ప్రేక్ష‌కుల‌కు ప‌సందైన వినోదాన్ని అందించ‌నుంది. ద‌స‌రా సంద‌ర్భంగా హోస్ట్ స‌మంత‌తో పాటు అక్కినేని వార‌సుడు అఖిల్‌, ఆర్ఎక్స్ 100 హీరో హీరోయిన్స్ కార్తికేయ‌, పాయ‌ల్ రాజ్‌పుత్‌, జ‌బ‌ర్ధ‌స్త్ ఫేం హైప‌ర్ ఆది బిగ్ బాస్ స్టేజ్‌పై నుండి ఫుల్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ అందించేందుకు సిద్ధ‌మ‌య్యారు.

తాజాగా సండే ఎపిసోడ్‌కు సంబంధించి 4.51ని.ల ప్రోమో విడుద‌ల చేయ‌గా ఇందులో స‌మంత చెప్పే ముద్దు ముద్దు ముచ్చ‌ట్లు, హైప‌ర్ ఆది పంచ్‌లు, కార్తికేయ‌, పాయ‌ల్‌ల ప‌ర్‌ఫార్మెన్స్‌లు అఖిల్ స్టైలిష్ ఎంట్రీని చూసి ప్రేక్ష‌కులు తెగ మురిసిపోతున్నారు. ఇక సాయంత్రం 6గం.ల‌కు టీవీ ముందు నుండి లేసే ప్ర‌స‌క్తే లేద‌ని డిసైడ్ అయిపోయితున్నారు. కొద్ది సేప‌టి క్రితం విడుద‌లైన ప్రోమోని బ‌ట్టి చూస్తే మూడు గంట‌ల షోలో స‌మంత, అఖిల్, హైప‌ర్ ఆది‌లు కొద్ది సేపు ఇంటి స‌భ్యుల‌తో సంద‌డి చేస్తే పాయ‌ల్‌, కార్తికేయ‌, గీతామాధురి త‌మ ప‌ర్‌ఫార్మెన్స్‌ల‌తో ప్రేక్ష‌కుల‌ని థ్రిల్ చేయ‌నున్నారని అర్ద‌మ‌వుతుంది.

ద‌స‌రా సంద‌ర్భంగా ఇంటి స‌భ్యుల‌కు వారి ఫ్యామిలీ మాట్లాడిన విజువ‌ల్స్‌ని చూపించారు. అఖిల్, సోహైల్, మోనాల్, అమ్మ రాజ‌శేఖ‌ర్, దివి ఇలా అంద‌రు చాలా ఎమోష‌న‌ల్ అయ్యారు. త‌న ఫ్యామిలీ ఇచ్చిన ఉత్సాహంతో గేమ్ ఇంకా బాగా ఆడుతానంటూ అఖిల్ చెప్ప‌డం మ‌నం ప్రోమోలో గ‌మనించ‌వ‌చ్చు. ఇక అవినాష్ స‌మంత‌తో మాట్లాడుతున్న స‌మ‌యంలో ప్ర‌తి సారి త‌న సెన్స్ ఆఫ్ హ్యూమ‌ర్ ఉప‌యోగించి ఆమెను నవ్విస్తున్నాడు. హైప‌ర్ ఆది త‌న‌దైన పంచ్‌ల‌తో హౌజ్‌మేట్స్‌తో పాటు ప్రేక్ష‌కుల‌ని కూడా ఎంట‌ర్‌టైన్ చేశాడు. చివ‌రిగా వ‌చ్చిన అఖిల్ .. నాన్న ఈ మ‌ధ్య ఇంటికి వ‌చ్చిన‌ప్పుడు మా గురించి మ‌ర‌చిపోయి మీ గురించి మాట్లాడుతున్నార‌ని చెప్పారు. దీంతో ఇంటి స‌భ్యులలో ఆనందం వెల్లివిరిసింది.

మొత్తానికి ద‌స‌రా స్పెష‌ల్ షో బిగ్ బాస్ సీజ‌న్ 4కి సంబంధించిన తాజా ఎపిసోడ్ ప్రేక్షకుల‌ని ఎంట‌ర్‌టైన్ చేయ‌డ‌మే కాదు, టీఆర్పీ రికార్డ్స్ కూడా తిర‌గ‌రాస్తుంద‌ని అంటున్నారు. ప్రోమోలో కొన్ని స‌ర్‌ప్రైజ్‌లు మాత్ర‌మే చూపించి ఉంటార‌ని, అస‌లు మ‌జా ఆరు గంట‌ల త‌ర్వాత ఉంటుంద‌ని బిగ్ బాస్ ఫ్యాన్స్ భావిస్తున్నారు. కాగా, నాగార్జున వైల్డ్ డాగ్ మూవీ షూటింగ్ కోసం మ‌నాలి వెళ్ళిన కార‌ణంగా స‌మంత ఈ రోజు షోని హోస్ట్ చేస్తున్న సంగ‌తి తెలిసిందే.