డిజాస్టర్ టాక్ వచ్చినా డోస్ తగ్గలేదు.. మాస్టర్ కు అప్పుడే అన్ని కోట్లా?

కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ ఎలాంటి సినిమా చేసినా కూడా బాక్సాఫీస్ వద్ద మినిమమ్ 100కోట్లకు తక్కువగా రాబట్టవు. కథలో మ్యాటర్ లేకపోయినా కూడా విజయ్ క్యారెక్టర్ ను సరిగ్గా ఎలివేట్ చేస్తే చాలు కలెక్షన్స్ వాటంతట అవే వస్తాయి. అయితే ఇటీవల విడుదలైన మాస్టర్ సినిమా అనుకున్నంత రేంజ్ లో అయితే పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకోలేదు.

vijay master movie review

కానీ సినిమాలో విజయ్ పాత్ర హైలెట్ గా ఉండడంతో ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. తమిళనాడులో 50కోట్ల ఓపెనింగ్స్ అందుకున్న సినిమాగా సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది. సినిమా శనివారమే 100కోట్ల క్లబ్ లో చేరినట్లు తెలుస్తోంది. తమిళ్ లోనే కాకుండా తెలుగు హిందీలో కూడా భారీగానే రిలీజ్ అయ్యింది. తెలుగులో దాదాపు పెట్టిన పెట్టుబడికి తగ్గట్లుగానే కలెక్షన్స్ వచ్చాయి.

మాస్టర్ సినిమాను ఖైదీ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ తెరకెక్కించిన విషయం తెలిసిందే. సినిమాకు ఇంకాస్త పాజిటివ్ టాక్ వచ్చి ఉంటే కలెక్షన్స్ రేంజ్ మరో లెవెల్లో ఉండేది. ఇక తెలుగులో కూడా విజయ్ కు మార్కెట్ ఏ రేంజ్ లో పెరిగిందో మరోసారి ఋజువయ్యింది. చూస్తుంటే రానున్న రోజుల్లో ఆ సంఖ్య మరింత ఎక్కువయ్యేలా ఉందని అనిపిస్తోంది. ఇక మాస్టర్ సినిమా బాలీవుడ్ లో డబ్ అయినప్పటికీ మళ్ళీ ఆ కథను రీమేక్ చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నట్లు సమాచారం.