గోపిచంద్ – రానా.. సేఫ్ గేమ్

టాలీవుడ్ లో రిలీజ్ డేట్స్ తో సోషల్ మీడియాలో ఒక్కసారిగా సందడి నెలకొంది. ఒకరి తరువాత మరొకరు అభిమానులకు మంచి కిక్కిచ్చారు. మళ్ళీ రిలీజ్ డేట్స్ దొరకవేమో అని ఎగబడి మరి రిలీజ్ చేసినట్లు అనిపించింది. సంక్రాంతికి క్రాక్ ఇచ్చిన హిట్టుతో నిర్మాతలకైతే కరోనా బయం పోయింది. ఇక ఏప్రిల్ లో ఇద్దరు హీరోలు సేఫ్ గేమ్ అనేలా సినిమాలను రిలీజ్ చేస్తున్నారు.

Gopi Chand with Seeti Maar director Sampath nandi

గౌతమ్ నందా అనంతరం గోపిచంద్, సంపత్ నంది కాంబినేషన్ లో రూపొందుతున్న సినిమా సీటీమార్. ఈ సినిమాపై అంచనాలు ఏ రేంజ్ లో ఉన్నాయో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఇప్పటికే సినిమాకి సంబంధించిన పోస్టర్స్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక ఫైనల్ గా సినిమాను ఏప్రిల్ 2న రిలీజ్ చేయాలని ఫిక్స్ అయ్యారు. ఇక ఏప్రిల్ చివరలో రానా దగ్గుబాటి విరటపర్వం సినిమా రాబోతోంది.

పెద్దగా క్లాష్ లేకుండానే ఈ ఇద్దరు హీరోలు బాక్సాఫీస్ వద్ద వీలైనంత త్వరగా లాభాలను అందుకోవాలని డిసైడ్ అయ్యారు. ఏప్రిల్ చివరలో 30న విరాటపర్వం సినిమాను రిలీజ్ చేయాలని ఫిక్స్ అయ్యారు. ఇక నక్సలిజం బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో సాయి పల్లవి కూడా ఒక ముఖ్యమైన పాత్రలో నటిస్తోంది. వేణు ఉడుగుల ఈ సినిమాను డైరెక్ట్ చేస్తుండగా ప్రియమణి కూడా ఒక నక్సలైట్ గా కనిపించనుంది. ఇక సినిమా బాక్సాఫీస్ వద్ద ఏ రేంజ్ లో హిట్టవుతుందో చూడాలి.