అల్లు అర్జున్ , కొరటాల శివ సినిమాకు సంబంధించి క్రేజీ అప్‌డేట్..!

అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా తర్వాత మరో రెండు ప్రాజెక్టులు కూడా ఈయన చేతిలో ఉన్నాయి. వరస సినిమాలకు కమిట్ మెంట్ ఇచ్చి వాటికి డేట్స్ అడ్జస్ట్ చేసే పనిలో ఉన్నాడు బన్నీ. ఈ క్రమంలోనే పుష్ప సినిమాను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని చూస్తున్నాడు. దర్శకుడు సుకుమార్ కు కూడా ఈ విషయంలో ఇప్పటికే సూచనలు కూడా వెళ్లినట్లు తెలుస్తుంది. ఈ సినిమాను ఆగస్ట్ 13న విడుదల చేయనున్నట్లు ఇప్పటికే ప్రకటించారు.

బ‌న్నీ త‌ర్వాతి సినిమాకు సంబంధించి క్రేజీ అప్‌డేట్..!

ఇదిలా ఉంటే ఈ సినిమా తర్వాత వేణు శ్రీరామ్ ఐకాన్.. కొరటాల శివతో ఓ సినిమాకు కమిట్ మెంట్ ఇచ్చాడు అల్లు అర్జున్. ఇందులో ఐకాన్ సినిమా కొంచెం ఆలస్యం అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. కానీ కొరటాల శివ సినిమాను మాత్రం చాలా వేగంగా పూర్తి చేయాలని చూస్తున్నాడు అల్లు అర్జున్. ఈయన ప్రస్తుతం చిరంజీవి ఆచార్య సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా మే 13న విడుదల కానుంది.

దాంతో ఆ తర్వాత ఖాళీ అయిపోతాడు కొరటాల. అందుకే ఆచార్య తర్వాత వెంటనే ఏ మాత్రం గ్యాప్ తీసుకోకుండా బన్నీ సినిమాను మొదలు పెట్టాలని చూస్తున్నాడు ఈ దర్శకుడు. ఈ సినిమాను కూడా తన కెరీర్ లోనే ఎప్పుడూ లేనంత వేగంగా పూర్తి చేయాలని చూస్తున్నాడు ఈ దర్శకుడు. ఆగస్ట్ తర్వాత షూటింగ్ మొదలు పెట్టి.. 2022 సమ్మర్ రిలీజ్ కు ప్లాన్ చేస్తున్నారు. ఈ మేరకు అఫీషియల్ అనౌన్స్ మెంట్ కూడా వచ్చింది. ఈ సినిమాను కొరటాల శివ స్నేహితుడు సుధాకర్ మిక్కిలినేని నిర్మిస్తున్నాడు.