రాముడి పై ఉన్న భక్తి భయమే నన్ను ఈ సినిమాలో నటించేలా చేశాయి: ప్రభాస్

అలనాటి టాలీవుడ్ స్టార్ హీరో కృష్ణంరాజు వారసుడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ప్రభాస్ ‘ఈశ్వర్’ సినిమా ద్వారా తన కెరీర్ ప్రారంభించి వరుస సినిమాలు చేస్తూ హీరోగా మంచి గుర్తింపు ఏర్పరచుకొని ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకున్నాడు. టాలీవుడ్ ఇండస్ట్రీకి మాత్రమే పరిమితమైన ప్రభాస్…. రాజమౌళి దర్శకత్వం వహించిన బాహుబలి సినిమా ద్వారా దేశవ్యాప్తంగా హీరోగా పాపులర్ అయ్యాడు. ఈ సినిమా ద్వారా పాన్ ఇండియా స్థాయికి వెళ్లిన ప్రభాస్ అప్పటినుండి పాన్ ఇండియా లెవెల్ లో తెరకెక్కుతున్న సినిమాలలో మాత్రమే నటిస్తూ బిజీగా ఉన్నాడు.

ఇటీవల రాధే శ్యామ్ సినిమాతో డిజాస్టర్ అందుకున్న ప్రభాస్ ఇప్పుడు ‘ఆది పురుష్’ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. రామాయణం ఇతిహాసం ఆధారంగా ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు ఓంరౌత్ తెరకెక్కించిన ‘ ఆదిపురుష్ ‘ సినిమాలో ప్రభాస్ రాముడి పాత్రలో ప్రేక్షకుల ముందుకి రానున్నాడు. ఇటీవల ఈ సినిమాకు సంబంధించిన టీజర్ విడుదలై ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది.

ఈ వేడుకలో పాల్గొన్న ప్రభాస్ సినిమా గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ క్రమంలో ప్రభాస్ మాట్లాడుతూ ‘ఆదిపురుష్’ సినిమాలో రాముడి క్యారెక్టర్ ఆఫర్ వచ్చినప్పుడు మూడు రోజులపాటు ఈ సినిమా చేయటానికి నేను అంగీకరించలేదు. కానీ రాముడిపై ఉన్న భక్తి, భయమే నన్ను ఈ సినిమాలో నటించేలా చేశాయి అంటూ చెప్పుకొచ్చాడు. అభిమానులందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ సినిమా జనవరి 12వ తేదీ సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకి రానుంది.