ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గురించి గత కొంతకాలంగా ఓ వార్త నెట్టింట చక్కర్లు కొడుతోంది. అదేంటంటే, అల్లు అర్జున్ తన మామ గారు అంటే, ఆయన భార్య స్నేహారెడ్డి తండ్రి చంద్రశేఖర్ రెడ్డి తరపున వచ్చే ఎన్నికల్లో ప్రచారం చేస్తారు అని. ఇప్పటి వరకు గాసిప్ గా ఉన్న ఈ వార్త ఇప్పుడు నిజం అని తేలింది.
ఈ విషయాన్ని చంద్రశేఖర్ రెడ్డి అధికారికంగా ప్రకటించారు. తన కోసం తన అల్లుడు అల్లు అర్జున్ 2024లో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారం చేస్తారు అని ఆయన ప్రకటించారు. చంద్రశేఖర్ రెడ్డి చాలా కాలంగా బీఆర్ఎస్ పార్టీలో కీలకంగా వ్యవహరిస్తున్నారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఆయన ఇబ్రహీంపట్నం నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. వచ్చే ఎన్నికల్లో తన సొంత నియోజకవర్గం నాగార్జున సాగర్ నుంచి పోటీ చేయాలని అనుకుంటున్నారు. ఆ టికెట్ కోసం ఆయన ప్రయత్నిస్తున్నారు.
ఈ క్రమంలో ఆయన తాజాగా ఓ స్టేట్మెంట్ పాస్ చేశారు. తన అల్లుుడు అల్లు అర్జున్ పాన్ ఇండియా స్టార్ పాపులారిటీని సంపాదించాడని, తన రాజకీయ ప్రయాణంలో ఆయన సేవలు తనకు ఎంతో ఉపయోగపడతాయి అని చెప్పారు. ఈ క్రమంలో అల్లు అర్జున్ తన ఎన్నికల క్యాంపైనింగ్ లో పాల్గొంటాడు అని చెప్పకనే చెప్పేశాడు.
కాగా, ఇటీవల పెద్దవూర మండలం నాగార్జున సాగర్ లో చంద్రశేఖర్ రెడ్డి ఓ ఫంక్షన్ హాల్ నిర్మించారు. దానిని నిన్న అల్లు అర్జున్ గ్రాండ్ ఓపెనింగ్ చేశారు. ఇక అల్లు అర్జున్ వచ్చాడు అని తెలియగానే అక్కడ కోలాహలం నెలకొంది. ఆయనను చూడటానికి అభిమానులు ఎగపడ్డారు. వచ్చే ఎన్నికల్లో క్యాంపైనింగ్ కి ఇది జస్ట్ శాంపిల్ అని తెలుస్తోంది.
కేవలం అల్లు అర్జున్ ఫంక్షన్ హాల్ ఓపెనింగ్ కి వస్తేనే ఇంత మంది వచ్చారు అంటే, ఇక ఆయన క్యాంపైనింగ్ వస్తే ఎలా ఉంటుందో స్పెషల్ గా చెప్పక్కర్లేదు. తన అల్లుడు తన తరుపున ప్రచారం చేస్తే, తాను కచ్చితంగా గెలుస్తానని చంద్రశేఖర్ కూడా ధీమాగా ఉన్నారు. కాగా, అల్లు అర్జున్ స్నేహారెడ్డిని 2011లో వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు సంతానం ఉన్నారు.