ఇవి తింటే ఆ సామ‌ర్థ్యం పెరుగుతుందా?

యాలకులు ఇది ఒక దివ్య ఔష‌ధం. అందుకు తగ్గట్టే అవి సువాసన, రుచి మాత్రమే కాదు… ఇంకా చాలా ప్రయోజనాలు కలిగిస్తున్నాయి. ఈ యాలుక‌లు స్వీట్లు, టీలు, ఇలా వంటల‌న్నిటిలోనూ వాడ‌తారు. యాలకుల పొడిని వేస్తుంటారు. ఐతే… యాలుకులు శృంగార సమస్యలకు చెక్ పెట్టగలవని పరిశోధనల్లో తేలింది. ఈ రోజుల్లో ప్ర‌తి ఒక్క‌రి లైఫ్ బిజీ లైఫ్ స్టైల్, రెడీ టూ ఈట్ ఆహారపు అలవాట్ల వల్ల ప్రజల్లో సహజ సిద్ధంగా ఉండే శృంగార సామర్ధ్యం తగ్గిపోతోంది. సెక్స్ పరమైన సమస్యలు ఎక్కువవుతున్నాయి. ముఖ్యంగా పిల్లలు పుట్టకపోవడమన్నది ఎక్కువ మందిలో కనిపిస్తోంది. ప్ర‌స్తుతం ప‌ని ఒత్తిడి ఎక్కువ‌గా ఉండ‌టం వ‌ల్ల అనేక సెక్స్ స‌మ‌స్య‌లు ఎదుర‌వుతున్నాయి. వీటిని పరిష్కరించుకోవడానికి యాలకుల వంటి సుగంధ ద్రవ్యాలు కొంతవరకూ ఉపయోగపడుతున్నాయి అని ప‌రిశోధ‌కులు చెబుతున్నారు.

yalukalu
yalukalu

యాలకులు మూడ్‌ని పెంచుతాయి. వాటి సువాసన ఒత్తిడిని దూరం చేస్తుంది. శృంగార జీవితంలో సమస్యలు ఉన్నవారు యాలకులు ఎక్కువగా తీసుకోవాలని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. చాలా మందికి పిల్లలు పుట్టకపోవడానికి ప్రధాన కారణం స్పెర్మ్ కౌంట్ తక్కువగా ఉండటం. రోజుకు 1 నుంచీ 2 యాలకులు తీసుకుంటే (ఏదో ఒక రూపంలో) వీర్య కణాలు వృద్ధి చెందుతాయి. నపుంసకత్వం లాంటి లైంగిక సమస్యలు దూరమవుతాయి. సంభోగంలో ఎక్కువసేపు పాల్గొనే శక్తిని యాలుక‌లు రెట్టింపు చేస్తాయి. అందువల్ల దంపతులకు యాలకులు ఎంతో మేలు చేస్తున్నట్లే. చర్మం పై ఎర్పడే నల్ల మచ్చల్ని యాలకులు తగ్గిస్తాయి. వెంట్రుకలు చిట్లిపోవడం, ఊడిపోవడం వంటి సమస్యలకు యాలకులు చెక్ పెడతాయి. జుట్టు ఒత్తుగా, బలంగా, కుదుళ్లు గట్టిగా ఉండేందుకు ఇవి దోహదపడతాయి. యాలకులు అధిక బరువును కూడా తగ్గిస్తాయి. యాలకుల్లోని వేడి మన శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ను కరిగిస్తుంది. ఇందుకోసం రోజూ రాత్రి వేళ ఓ యాలుకను తినేయాలి. బరువు తగ్గడమే కాదు… శరీరంలో వ్యర్థాలు, హానికారక బ్యాక్టీరియా వంటి వాటిని యాలకులు తరిమేస్తాయి.