నిరుద్యోగులకు తీపికబురు.. భారీ వేతనంతో యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ లో ఉద్యోగ ఖాళీలు!

యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ నిరుద్యోగులకు తీపికబురు అందించింది. 95 ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం జాబ్ నోటిఫికేషన్ ను రిలీజ్ చేసింది. డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల భర్తీ జరగనుండగా నిరుద్యోగులకు భారీ స్థాయిలో ప్రయోజనం చేకూరనుంది. https://uohyd.ac.in/non-teaching-project-staff/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం అయితే ఉంటుంది.

ఈ ఉద్యోగ ఖాళీలలో డిప్యూటీ రిజిస్ట్రార్ (డిప్యుటేషన్) 1 ఉండగా అసిస్టెంట్ లైబ్రేరియన్ 4 ఉద్యోగ ఖాళీలు, అసిస్టెంట్ రిజిస్ట్రార్ 2 ఉద్యోగ ఖాళీలు, సెక్షన్ ఆఫీసర్ 2 ఉద్యోగ ఖాళీలు, అసిస్టెంట్ ఇంజినీర్ (సివిల్/ ఎలక్ట్రికల్) 2 ఉద్యోగ ఖాళీలు, సెక్యూరిటీ ఆఫీసర్ 2 ఉద్యోగ ఖాళీలు, సీనియర్ అసిస్టెంట్ 2 ఉద్యోగ ఖాళీలు, ప్రొఫెషనల్ అసిస్టెంట్ 1, ల్యాబొరేటరీ అటెండెంట్ 8 ఉద్యోగ ఖాళీలు ఉన్నాయి.

హిందీ టైపిస్ట్ ఒక ఉద్యోగ ఖాళీ ఉండగా జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ 44 ఉద్యోగ ఖాళీలు, లైబ్రరీ అసిస్టెంట్ 4 ఉద్యోగ ఖాళీలు, ఆఫీస్ అసిస్టెంట్ 10 ఉద్యోగ ఖాళీలు, స్టాటిస్టికల్ అసిస్టెంట్ 1, జూనియర్ ప్రొఫెషనల్ అసిస్టెంట్ 2, అసిస్టెంట్ సెక్యూరిటీ ఆఫీసర్ 1 ఉద్యోగ ఖాళీ ఉండగా జూనియర్ ఇంజినీర్ (సివిల్/ ఎలక్ట్రికల్) ఉద్యోగ ఖాళీలు 8 ఉన్నాయి. ఈ ఉద్యోగ ఖాళీలకు వేర్వేరు విద్యార్హతలు ఉన్నాయి.

అనుభవం ఉన్నవాళ్లు మాత్రమే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. రాతపరీక్ష, ట్రేడ్ టెస్ట్, ఇంటర్వ్యూ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. అభ్యర్థులు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకుని యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ అడ్రస్ కు దరఖాస్తులను పంపాల్సి ఉంటుంది. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు వెంటనే దరఖాస్తు చేసుకుంటే మంచిది.