విద్యార్థులకు అదిరిపోయే శుభవార్త.. ఢిల్లీ వర్సిటీలో స్టైఫండ్ ఎంతంటే?

దేశంలో నిరుద్యోగుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఎంతో కష్టపడితే మాత్రమే సులువుగా ఉద్యోగం లభించే అవకాశాలు అయితే ఉంటాయి. విద్యార్థులు ఇంటర్న్ షిప్ చేయడం ద్వారా ఉద్యోగం గురించి పూర్తి అవగాహనను కలిగి ఉండటంతో పాటు సులువుగా జాబ్ పొందే ఛాన్స్ అయితే ఉంటుంది. ఢిల్లీ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్‌-2023 అప్లికేషన్ ప్రాసెస్ తాజాగా మొదలైంది.

 

రెగ్యులర్ బోనఫైడ్ విద్యార్థులు ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హత కలిగి ఉంటారు. dsw.du.ac.in వెబ్ సైట్ లింక్ ద్వారా ఈ ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకునే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. ఈ ఇంటర్న్ షిప్ కు దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు జూన్, జులై నెలలలో ఇంటర్న్ షిప్ కు హాజరు కావాల్సి ఉంటుంది. ఎవరైతే ఇంటర్న్ షిప్ కు ఎంపికవుతారో వాళ్లు నెలకు 10,000 రూపాయలు స్టైఫండ్ పొందవచ్చు.

 

ఈ ఇంటర్న్ షిప్ కోసం దరఖాస్తు చేసేవాళ్లు వారానికి 20 గంటల పాటు పని చేయాల్సి ఉంటుందని సమాచారం. ఈ ఇంటర్న్ షిప్ ను పూర్తి చేసిన వాళ్లకు డీన్ ఆఫ్ స్టూడెంట్ వెల్ఫేర్ నుంచి సర్టిఫికెట్ లభించే అవకాశం అయితే ఉంటుంది. ఈ ఇంటర్న్ షిప్ ప్రోగ్రామ్ కు 200 లోపే ఖాళీలు ఉంటాయని తెలుస్తోంది. అర్హత, ఆసక్తి ఉన్న విద్యార్థులు ఈ ఇంటర్న్ షిప్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

 

ఆన్ లైన్ లో ఈ ఇంటర్న్ షిప్ కు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉండగా ఈ ఉద్యోగాలకు ఎంపికైన వాళ్లకు కెరీర్ పరంగా మేలు జరుగుతుంది. మే నెల 17వ తేదీ ఈ ఇంటర్న్ షిప్ కు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉండటం గమనార్హం. వరుస జాబ్ నోటిఫికేషన్ల ద్వారా నిరుద్యోగులకు బెనిఫిట్ కలుగుతుంది.