ఔట్ సోర్సింగ్ ఉద్యోగ ఖాళీల భర్తీ దిశగా తెలంగాణ సర్కార్ అడుగులు.. ఏమైందంటే?

తెలంగాణ రాష్ట్ర నీటి పారుదల శాఖ నిరుద్యోగులకు తీపికబురు అందించింది. 1878 ఉద్యోగ ఖాళీల భర్తీ దిశగా అడుగులు వేస్తోంది. ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన ఈ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయనున్నారు. రాష్ట్ర ఆర్థిక శాఖ నుంచి ఈ మేరకు ఉత్తర్వులు జారీ అయ్యాయి. 1597 లస్కర్ల ఉద్యోగ ఖాళీలతో పాటు 281 హెల్పర్ల ఉద్యోగ ఖాళీలను ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. ఈ ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం స్థానిక ఎస్.ఈ, స్థానిక డీసీఈలతో స్క్రీనింగ్ కమిటీని ఏర్పాటు చేశారు.

వేర్వేరు శాఖల్లో ఉన్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగ ఖాళీలను సైతం భర్తీ చేయనున్నామని తెలంగాణ సర్కార్ చెబుతుండటం గమనార్హం. గత నెలలో నీటి పారుదల నిర్వహణలో కీలకంగా ఉండే లస్కర్లు, సహాయకుల నియామకానికి సీఎం రేవంత్ రెడ్డి ఆమోదం తెలిపారు. వీరి నియామకం వల్ల జలాశయాలు, కుంటలు, ఆయకట్టు కింద నీటిపారుదల నిర్వహణ మెరుగుపడనుందని చెప్పవచ్చు.

గత కొన్నేళ్లుగా తెలంగాణ సర్కార్ లస్కర్లు, సహాయకుల ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయలేదనే సంగతి తెలిసిందే. అర్హత ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కోసం వెంటనే వెంటనే దరఖాస్తు చేసుకుంటే మంచిది. వరుస జాబ్ నోటిఫికేషన్ల ద్వారా నిరుద్యోగులకు ఊహించని స్థాయిలో ప్రయోజనం చేకూరనుంది. ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లకు ఒకింత భారీ వేతనం లభించనుందని తెలుస్తోంది.