సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్ నిరుద్యోగులకు తీపికబురు అందించింది. వేర్వేరు ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం ఈ సంస్థ జాబ్ నోటిఫికేషన్ ను విడుదల చేసింది. sfio.gov.in వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. నవంబర్ నెల 5వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉంది. యంగ్ ప్రొఫెషనల్, కన్సల్టెంట్ ఉద్యోగ ఖాళీలను ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు.
సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్ లా, ఫైనాన్సియల్ అనాలసిస్, ఫోరెన్సిక్ ఆడిట్ వింగ్ విభాగాలలో ఈ ఉద్యోగ ఖాళీల భర్తీ జరగనుంది. మొత్తం 91 ఉద్యోగ ఖాళీలను ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. ఈ ఉద్యోగ ఖాళీలలో జూనియర్ కన్సల్టెంట్ ఉద్యోగ ఖాళీలు 62 ఉండగా యంగ్ ప్రొఫెషనల్ ఉద్యోగ ఖాళీలు 26, సీనియర్ కన్సల్టెంట్ ఉద్యోగ ఖాళీలు 3 ఉన్నాయి.
లా గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఒక సంవత్సరం అనుభవం ఉన్నవాళ్లు యంగ్ ప్రొఫెషనల్ (లా) ఉద్యోగ ఖాళీలకు అర్హులు కాగా అడ్వకేట్‌గా కనీసం మూడు నుంచి ఎనిమిదేళ్ల అనుభవం ఉన్నవాళ్లు జూనియర్ కన్సల్టెంట్(లా) ఉద్యోగ ఖాళీలకు అర్హత కలిగి ఉంటారు. అడ్వకేట్‌గా కనీసం మూడు నుంచి ఎనిమిదేళ్ల అనుభవం ఉన్నవాళ్లు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
ఇతర ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలు, రెగ్యులేటరీ బాడీలపై ఎక్స్‌ఫోజర్ ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు ఎంపికయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. సీఏ, ఐసీడబ్ల్యూఏ, ఎంబీఏ (ఫైనాన్స్) కోర్సులు పూర్తి చేసిన వాళ్లు యంగ్ ప్రొఫెషనల్ ఉద్యోగాలకు అర్హులు కాగా సీఏ, సీడబ్ల్యూఏ, ఎంబీఏ(ఫైనాన్స్) చదివిన వాళ్లు జూనియర్ కన్సల్టెంట్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. సీఏ, సీడబ్ల్యూఏ, ఎంబీఏ(ఫైనాన్స్) పూర్తి చేసిన వాళ్లు సీనియర్ కన్సల్టెంట్ ఉద్యోగాలకు అర్హులు. గరిష్టంగా 2.5 లక్షల రూపాయల వరకు ఈ ఉద్యోగాలకు ఎంపికైన వాళ్లకు వేతనం లభిస్తుంది.