ఇల్లు లేదా ఫ్లాట్ ను కొనుగోలు చేయాలని భావిస్తున్నారా.. కచ్చితంగా చెక్ చేయల్సిన డాక్యుమెంట్లు ఇవే!

ఈ మధ్య కాలంలో జనంలో చాలామంది ఇల్లు లేదా ఫ్లాట్ కొనుగోలుపై ఎక్కువగా దృష్టి పెడుతున్నారు. ఇల్లు లేదా ఫ్లాట్ కొనుగోలు చేయడం ద్వారా దీర్ఘకాలంలో కళ్లు చెదిరే ఆదాయం పొందవచ్చని భావిస్తున్నారు. భూమి విలువ రోజురోజుకు పెరుగుతుందే తప్ప తగ్గడం లేదనే సంగతి తెలిసిందే. అందువల్ల భూమిపై పెట్టుబడులు పెడితే నష్టపోయే అవకాశం అయితే దాదాపుగా లేదని చెప్పవచ్చు.

కమర్షియల్ ప్రాజెక్ట్ లలో పెట్టుబడులు పెట్టడం ద్వారా మంచి లాభాలు సొంతమవుతాయని చెప్పవచ్చు. ఆస్తిని కొనుగోలు చేసే సమయంలో మొదట టైటిల్ డీడ్ ను చెక్ చేయాల్సి ఉంటుంది. టైటిల్ ద్వారా ఆస్తిని ఎవరి నుంచి కొనుగోలు చేస్తున్నామనే విషయం తెలిసే ఛాన్స్ ఉంటుందని చెప్పవచ్చు. ఆస్తిని కొనుగోలు చేసిన సమయంలో ఆ ప్రాపర్టీపై ఏదైనా రుణం ఉందో లేదో చెక్ చేసుకోవాల్సి ఉంటుంది.

రుణం ఉన్న ప్రాపర్టీలను కొనుగోలు చేయడం ద్వారా భవిష్యత్తులో కొత్త ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు అయితే ఉంటాయి. భూమి లేదా ఇల్లు కొనుగోలు చేసేవాళ్లు నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ను కచ్చితంగా కలిగి ఉండాలి. ఇల్లు లేదా ఫ్లాట్ ను కొనుగోలు చేసేవాళ్లు లేఅవుట్ కు ఆమోదం ఉందా? లేదా? అనే వివరాలను తెలుసుకోవాలి. నిర్మించిన ఆస్తిని కొనుగోలు చేసేవాళ్లు ప్రారంభ క్లియరెన్స్ ను పొందితే మంచిది.

ఈ సర్టిఫికెట్లతో పాటు ఇంటికి సంబంధించి ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ ఉంటే ఆ ఇంటిని కొనుగోలు చేసుకోవచ్చు. కచ్చితంగా చెక్ చేయాల్సిన డాక్యుమెంట్లను చెక్ చేసి ఇల్లు లేదా ఫ్లాట్ ను కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఇల్లు లేదా ఫ్లాట్ కొనుగోలు చేయాల్సిన డాక్యుమెంట్ల విషయంలో ఏవైనా తప్పులు చేస్తే మాత్రం ఇబ్బందులు పడక తప్పదని చెప్పవచ్చు.